సాక్షి, హైదరాబాద్: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందే లబ్ధిదారుల ఎంపిక మరో పది రోజుల్లో పూర్తి కానుంది. 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి 62,978 మందికి రాయితీ రుణాలు ఇచ్చేలా ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించిన ఆ శాఖ... పది రోజుల్లోగా అర్హులను తేల్చా ల్సిందిగా జిల్లా ఎస్సీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు లబ్ధిదా రులకు 3 కేటగిరీల్లో రాయితీలు అందిం చనుంది. రూ.లక్ష లోపు స్వయం ఉపాధి యూనిట్ నెలకొల్పిన లబ్ధిదారులకు రూ. 80 వేల రాయితీ అందిస్తోంది.
రూ. 2 లక్షల యూనిట్‌పై రూ. 1.40 లక్షల రాయితీ, రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల యూనిట్‌పై 60% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి సంబంధిం చి రాయితీ కింద రూ. 1,358.89 కోట్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. పదివేల ఎకరాల కొనుగోలుకు సిద్ధం దళితులకు భూ పంపిణీపై ప్రత్యేక కార్యా చరణ సిద్ధం చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. సంక్షేమ భవన్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాల యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2017–18 వార్షిక సంవత్సరా నికి పదివేల ఎకరాలు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment