సాక్షి, వరంగల్ : నడిరాత్రి మొదలుకొని సరిగ్గా తెల్లవారే వరకు మిగితా వారంతా గాఢ నిద్రలో ఉండగా వారు మాత్రం కంటిపై రెప్పవేయకుండా పనిచేస్తుంటారు. శుభ్రతను వృత్తిగా తీసుకొని చెత్తాచెదారాన్ని ఊడ్చిపారేస్తుంటారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో.. వారు సురక్షితంగా ఇల్లు చేరే వరకు కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే నడి రోడ్డుపై వాళ్లు చెత్తను శుభ్రం చేసే పనుల్లో ఉండగా అటుగా వచ్చే వాహనాలు ఎలా వస్తుంటాయో ఎవరూ ఊహించలేరు. ఎవరు తాగి నడుపుతుంటారో, ఎవరు నిద్రపోయి డ్రైవ్ చేస్తుంటారో, ఎవరు కావాలని మీదకు వాహనాలు తోలుకొస్తారో అస్సలు ఊహించలేరు. ఇంకా చెప్పాలంటే పనిమీద ధ్యాసతో పాపం వారు పారిశుధ్య పనుల్లో నిమగ్నమవుతారు.
అలా ఉన్న సమయంలో వారు అనేక ప్రమాదాలకు గురై ప్రాణాలుకోల్పోతుండటం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ ఘటన వరంగల్‌లో బుధవారం తెల్లవారు జామున 4.25గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఆ వీడియో చూస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. సుమలత అనే మహిళ వరంగల్ జిల్లా పరకాలలో నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె తెల్లవారు జామున రోడ్డు ఊడుస్తుండగా ఆమె వెనుకాలే వచ్చిన ఓ లారీ ఒళ్లు గొగుర్పొడిచేలా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లో ఎగిరి పడ్డారు. పక్కనే ఉన్న మరోకార్మికురాలు వెంటనే వెళ్లి ఆమెను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆ కార్మికురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత ఆమెకు దూరంగా వెళ్లిన లారీ అనూహ్యంగా ఆమె వైపు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని వీడియో చూసిన వాళ్లంతా అంటున్నారు.
సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో వీక్షించండి
Comments
Please login to add a commentAdd a comment