అది చెప్పుల దుకాణదారుల కుట్ర | Shoe shoppers it's a conspiracy | Sakshi
Sakshi News home page

అది చెప్పుల దుకాణదారుల కుట్ర

Published Fri, Oct 17 2014 12:46 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

అది చెప్పుల దుకాణదారుల కుట్ర - Sakshi

అది చెప్పుల దుకాణదారుల కుట్ర

  • వీడిన రూ. 30 లక్షల దోపిడీ కేసు
  • ఆరుగురు నిందితుల అరెస్ట్
  • రూ. 26.7 లక్షల స్వాధీనం
  • చాంద్రాయణగుట్ట: కలెక్షన్ ఏజెంట్ కళ్లల్లో కారం చల్లి... రూ. 30 లక్షల దోపిడీ  కేసును ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. చెప్పులు దుకాణదారులే ఈ దోపిడీకి కుట్రదారులని తేల్చారు. ఆరుగురిని అరెస్టు చేసి... వారి వద్ద నుంచి రూ. 26.70 లక్షల నగదు, కత్తి, రెండు బైక్‌లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  

    పురానీహవేళీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో గురువారం నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పహాడీషరీఫ్ ఠాణా పరిధిలోని జల్‌పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(21) చెత్తబజార్‌లో ‘ఎంఎస్ గ్రాండ్ ’ పేరిట చెప్పుల దుకాణం నడుపుతున్నాడు. మీర్‌చౌక్ లక్కడ్‌కోట్‌కి చెందిన విద్యార్థి షెహ్‌బాజ్ ఖాన్ (20) తండ్రి కూడా చెత్తబజార్‌లోనే డాలర్ చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. చెత్త బజార్‌లోని దుకాణదారుల నుంచి శ్యాం సుందర్ అనే కలె క్షన్ ఏజెంటు ప్రతి రోజు రూ. 20 నుంచి రూ. 30 లక్షల వరకూ వసూలు చేసి సుల్తాన్‌బజార్‌లో బ్యాంక్‌లో జమ చేస్తుంటాడు.

    ఇది గమనించిన షేక్ ఇమ్రాన్, షెహ్‌బాజ్ ఖాన్‌లు అతడి నుంచి డబ్బు దోచుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా మూడు నెలల క్రితం ఛత్రినాక లిమ్రా కాలనీలో ఉండే పండ్ల వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ (21)తో కలిసి రెక్కీ నిర్వహించారు.  ఆ తర్వాత ఇమ్రాన్ ఛత్రినాకలో ఉండే  బీటెక్ విద్యార్థి మహ్మద్ జీషాన్‌అలీ (22), శాలిబండకు చెంది మహ్మద్ అబ్దుల్ ఖాదర్ అన్సారీ (24), డిగ్రీ విద్యార్థి మహ్మద్ సల్మాన్‌ఖాన్ (20)లతో కలిసి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం నలుగురూ కలిసి శ్యాంసుందర్ కదలికలపై రెక్కీ నిర్వహించారు.

    ఆగస్టు 23న చెత్త బజార్‌లో డబ్బు వసూలు చేసుకొని బైక్‌పై వెళ్తున్న శ్యాంసుందర్‌ను కోఠిలోని 94 బస్టాప్ లైన్ వరకు  రెండు బైక్‌లపై అనుసరించారు.  అక్కడ శ్యాం సుందర్ బైక్‌ను అడ్డగించి.. అతడి కళ్లల్లో కారం చల్లి, తలపై కత్తితో దాడి చేశారు. అతడి వద్ద  రెండు బ్యాగ్‌లలో ఉన్న రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. ఈ మొ త్తాన్ని ఆరుగురూ పంచుకున్నారు. మొదట్లో బాధితుడు రూ. 40 లక్ష లు పోయినట్టు సుల్తాన్‌బజార్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీ సులు అతడి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించగా దోపిడీకి గురైంది రూ. 30 లక్షలని తేలింది.  

    విశ్వసనీయ సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై    ఎ.సుధాకర్ గురువారం లిమ్రా కాలనీలో ఉన్న నలుగురు నిందితులతో పాటు చెత్తా బజార్ షేక్ ఇమ్రాన్, షానబాజ్ ఖాన్‌లను అరెస్ట్ చే శారు. వారి వద్ద నుంచి రూ. 26.7 లక్షల నగదు, కత్తి,  బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.  నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన ఎస్సై సుధాకర్‌కు కమిషనర్ అభినందనలు తెలిపి నగదు పురస్కారంఅందించారు.  కాగా నిందితులను ‘నిందితుల గు ర్తింపు పరీక్ష’ కోసం మీడియా ముందు ప్రవేశపెట్టలేదు.

    తదుపరి విచారణ నిమిత్తం నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. విలేకరుల సమావేశంలోఅదనపు పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, జాయింట్ కమిషనర్ (ఎస్.బి) మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠీ, నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సైలు శేఖర్ రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.  
     
    జల్సాల కోసం చోరీల బాట...

    ఈ ఆరుగురు నిందితులలో ఇద్దరు విద్యార్థులు  న్నారు. వీరిలో బీటెక్ ఫైనలియర్ చదివే మహ్మద్ జీషాన్ అలీ, బీకాం సెకండ్ ఇయర్ విద్యార్థి సల్మాన్‌ఖాన్, షహబాజ్ ఖాన్  ఉన్నారు. వీరికి ఫీజు  రీయింబర్స్‌మెంట్, తల్లిదండ్రుల నుంచి డబ్బులు వస్తున్నప్పటికీ కూడా జల్సాల కోసం చోరీల బాట పట్టి కటకటాలపాలయ్యారు.
     
    వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ : కమిషనర్

    పాతబస్తీలో పేదల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో ప్రత్యేక నిఘా పెట్టి ప్రజలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారాలను అరెస్ట్ చేస్తున్నామన్నారు. అలాగే, సూడో పోలీసులు, చైన్‌స్నాచర్లు, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారందరిపై కూడా  పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. హుమాయన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కోసం ప్రత్యేక విచారణ కమిటీ,  బంగారం దోపిడీ ఘటనలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. కలెక్షన్ ఏజెంట్లు కూడా ఇలా పెద్ద ఎత్తున డబ్బులను తీసుకెళ్లరాదని....ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ బ్యాంకింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement