కేంద్రం ఇవ్వదు.. రాష్ట్రం అడగదు
ఉపాధిహామీకి నిధుల కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధిహామీ పథకం అమలు పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి పనులు చేసిన కూలీలకు వేత నాలిచ్చేందుకూ నిధుల కొరత ఏర్పడింది. నిన్నమొన్నటివరకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో కూలీలకు వేతనా లను తామే నేరుగా చెల్లిస్తామని ప్రకటించిన కేంద్రం.. పక్షం రోజులుగా వేతన చెల్లింపుల ను నిలిపివేసింది. దీంతో రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సుమారు రూ.40 కోట్ల మేర వేతన చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఆగిన వేతన చెల్లింపులు...
గత నెల 1 నుంచి ఉపాధి పనులు చేసిన కూలీలకు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఎన్‌ఈఎఫ్‌ఎంఎస్) ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నేరుగా వేతనాలు అందుతున్నాయని.. ఉన్నట్టుండి జనవరి 20 నుంచి చెల్లింపులు నిలిచిపోయా యని క్షేత్ర స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఉపాధిహామీకి కేటాయించిన నిధులను ఉత్తరాది రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఎగరేసు కు పోతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తు న్నాయి. నిధుల విషయమై ఉత్తరాది రాష్ట్రాల నేతలు బలమైన లాబీయింగ్ చేస్తున్నారని, తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల నేతలు పట్టించుకోక పోవడంవల్లనే నిధులు రావడం లేదని సర్పంచుల సంఘాలు అంటున్నాయి. మరోవైపు వేతన కాంపోనెంట్ పెరిగితేనే మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు మంజూరు కానున్నాయి. గ్రామాలలో రూ. 600 కోట్ల ఉపాధిహామీ మెటీరియల్ కాంపో నెంట్ నిధులతో సిమెంట్ రహదారులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం.. వేతన కాంపోనెంట్‌ను పెంచేందుకు అవసర మైన నిధులను కేటాయించడంలేదు.
‘ఉపాధి’ కూలీల అవస్థలు...
అటు కేంద్రం నిధులివ్వక.. ఇటు రాష్ట్రం పట్టించుకోక వేతనం కోసం ఉపాధి కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధి కూలీల సంఖ్య తగ్గిపోయే ప్రమాదముంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చూపి.. కేంద్రం ఉపాధిహామీ నిధుల్లో మరింత కోత పెట్టే ప్రమాదం ఏర్పడనుంది. కేంద్రం సకాలంలో నిధులివ్వకపోయినా కూలీలకు వేతన చెల్లిం పులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణా భివృద్ధి శాఖకు రివాల్వింగ్ ఫండ్‌ను అందిస్తే మేలని సర్పంచులు సూచిస్తున్నారు.