చాంద్రాయణగుట్ట: ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ... హవాలా రూట్‌లో * 1.10 కోట్ల నగదును తరలిస్తున్న ఇద్దరు యువకులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...ముంబై ప్రాంతానికి చెందిన హీరాలాల్ చౌదరి అనే వ్యక్తి ముంబైలోని జువేరియా బజార్‌లో బంగారం, మొబైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.
దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చి ముంబై, హైదరాబాద్ నగరాలలోని బంగారు వ్యాపారులకు విక్రయిస్తుంటాడు. బంగారాన్ని తీసుకున్న వ్యాపారులు ఇచ్చే భారీ నగదును బినామీ అకౌంట్ల ద్వారా తిరిగి తన అకౌంట్‌కు వేయించుకుంటాడు. దీనికోసం తనకు తెలిసిన మోతీ సింగ్ రాజ్‌పురోహిత్ (27) అనే యువకుడిని ఏజెంట్‌గా నియమించుకున్నాడు. బేగంబజార్‌లోని శ్రీ రేణుకా మాత కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మేనేజర్ అనిల్ మాండలిక్(29)ను కూడా మచ్చిక చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా మోతీసింగ్ రాజ్‌పురోహిత్, అనిల్ మాండలిక్‌లు గురువారం పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్‌కు చెందిన సోని అగర్వాల్ అనే బంగారు వ్యాపారి వద్ద * 1.10 కోట్ల నగదు తీసుకొని బ్యాంక్‌లో వేసేందుకు బయలుదేరారు. సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.వి.సూర్యప్రకాష్ రావు నేతృత్వంలోని ఎస్సైల బృందం జె.రాజశేఖర్, బి.మధుసూదన్, గౌస్ ఖాన్, డి.వెంకటేశ్వర్లు షాయినాయత్ గం జ్‌లోని సాబూ డయాగ్నోస్టిక్ సెంటర్ వద్ద మోతీసింగ్ , అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద 80 కట్టలతో రూ.వెయ్యి నోట్లు, 60 కట్టలతో రూ.500 నోట్లు లభ్యమయ్యాయి. వారిని విచారించగా, అసలు విషయం వెల్లడించారు. నిందితుల నుంచి నగదుతో పాటు హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం వారిని షాయినాయత్ గంజ్ పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న మొత్తాన్నిపోలీసుల ద్వారా ఐటీ, కస్టమ్స్ అధికారులకు అప్పగించనున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు.
బినామీ అకౌంట్లలో జమ చేస్తూ...
అక్రమంగా కిలోల్లో బంగారాన్ని దిగుమతి చేసి, కోట్లలో డబ్బులు తీసుకునే హీరాలాల్ చౌదరి రిజర్వ్ బ్యాంక్ అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడేవాడు. బేగంబజార్‌లోని శ్రీ రేణుకా మాత కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌తో కుమ్మకై బినామీ అకౌంట్లలో * 5, * 6, *8, * 9 లక్షల చొప్పున జమ చేయించి....తిరిగి ఆ మొత్తాన్ని హీరాలాల్ అకౌంట్‌కు వేర్వేరుగా పంపించేవారు. బ్యాంక్ యాజమాన్యం ఆదేశాలతోనే మేనేజర్ అనిల్ ఆ మొత్తాన్ని తీసుకెళ్లడానికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నా రు. ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి అకౌంట్‌తో పాటు మరి కొన్ని అకౌంట్లలో మొత్తాన్ని జమ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హవాలా గుట్టు రట్టు
Published Fri, Aug 8 2014 4:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement