కేసీఆర్‌వి గాలిమాటలు: సిరిసిల్ల రాజయ్య | siricilla rajaiah slams kcr on textile park issue | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌వి గాలిమాటలు: సిరిసిల్ల రాజయ్య

Published Tue, Dec 30 2014 2:37 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

కేసీఆర్‌వి గాలిమాటలు: సిరిసిల్ల రాజయ్య - Sakshi

కేసీఆర్‌వి గాలిమాటలు: సిరిసిల్ల రాజయ్య

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గాలిమోటార్లలో తిరుగుతూ గాలిమాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్) విమర్శించారు. సీఎం వరంగల్ పర్యటన సందర్భంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. సోమవారం సచివాలయంలో రాజయ్య మీడియాతో మాట్లాడారు.

వరంగల్‌కు టెక్స్‌టైల్ పార్కు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని, అయితే దాన్ని తానే తెచ్చినట్టు కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేవలం ప్రసంగాలకే పరిమితమవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement