అప్పుల బాధతో ఆరుగురు రైతుల ఆత్మహత్య | Six farmers suicide with Debt suffering | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో ఆరుగురు రైతుల ఆత్మహత్య

Published Mon, Oct 20 2014 4:24 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Six farmers suicide with Debt suffering

సాక్షి, నెట్‌వర్క్: వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములుతండాకు చెందిన గిరిజన రైతు బానోతు ఈర్యా (42)కు రెండు ఎకరాల పొలం ఉంది. పంట సరిగా పండలేదు. అప్పుల బాధతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో ఆదివారం పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన రైతు చిన్నగంగన్న(45) తన భూమిలో పత్తి  సరిగా మొలకెత్తలేదు. దీంతో రెండోసారి విత్తి, డీజిల్ ఇంజిన్ తెచ్చి వాగు నీటిని పంటకు పారించాడు. రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు.

పెట్టుబడి తిరి గొచ్చే పరిస్థితి లేకపోవడం.. అప్పులు తీర్చే మార్గం కని పించకపోవడంతో  శనివారం  విషం తాగాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కి చెందిన చిటికెల నర్సింహులు(30) పురుగుమందు తాగి ఉస్మాని యా ఆస్పత్రి శనివారంరాత్రి మృతి చెందాడు. మిడ్జిల్ మం డలం బైరంపల్లికిచెందిన గోపాల్‌జీ(60) సాగు చేసిన వరి, పత్తి ఎండిపోవడంతో ఆదివారం కరెంటు తీగలను పట్టుకుని  మృతి చెందాడు. చిన్నఎల్కిచర్ల పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడకి చెందిన గొల్ల (చక్కని) నర్సింహులు(30) పదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు వేశాడు.

రూ.రెండులక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటచేతికి రాకపోవడంతో శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మం డలం పాశంవారిగూడేనికి చెందిన మారెడ్డి వెంకట్‌రెడ్డి (44) తన 15 ఎకరాల భూమితోపాటు మరో 15 ఎకరాలు కౌలు కు తీసుకుని పత్తి సాగు చేశాడు. రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. వర్షాభావం, తెగుళ్లతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పురుగుల మందు తాగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement