విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నాగుపాము హల్‌చల్ | snake hul chul in electric substation | Sakshi
Sakshi News home page

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నాగుపాము హల్‌చల్

Published Tue, Dec 1 2015 6:16 PM | Last Updated on Wed, Sep 5 2018 4:03 PM

snake hul chul in electric substation

యాలాల(రంగారెడ్డి జిల్లా): దౌలాపూర్ సమీపంలోని సబ్‌స్టేషన్‌లో మంగళవారం ఓ నాగుపాము సిబ్బందిని హడలెత్తించింది. నాగుపాము కారణంగా దాదాపు మూడు గంటల పాటు విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఆపరేటర్ లింగం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విధుల్లోకి వచ్చాడు. ఆ సమయంలో సబ్‌స్టేషన్‌లోని ప్యానల్ బోర్డులో వైర్లు కాలిపోతున్న వాసన రావడంతో ప్యానల్ బోర్డు తెరిచాడు.

అప్పటికే పలుమార్లు విద్యుదాఘాతానికి గురై కోపంగా ఉన్న నాగుపామును చూసి లింగం భయభ్రాంతికి గురయ్యాడు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి, విషయాన్ని తోటి ఆపరేటర్లతో పాటు ఏఈకి తెలిపాడు. పాము కోసం సిబ్బందితో పాటు స్థానికులు దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. మూడు గంటల పాటు వెతికినా కనిపించకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement