పోలీస్‌స్టేష సమీపంలోని ఓ ఇంట్లో పడగ విప్పిన పాము
రేగోడ్(మెదక్): మండల కేంద్రంలో పాముల సంచారం పెరుగుతోంది. కాలనీల్లో అపరిశుభ్రవాతావరణం విపరీతంగా పెరిగిన పిచ్చి మొక్కలు పా ముల నివాసానికి దోహదం చేస్తున్నాయి. పలు చోట్ల పాముల సంచారానికి జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేష పరిధిలో ఆదివారం పాము సంచారం కలకలం రేపింది. ఓ ఇంట్లో పడుకున్న బాలికిపై నుంచి పాము వెళ్లడం కుటుంబ సభ్యులును, కాలనీ వాసులను ఆందోళనకు గురిచేసింది. ఈ ఇంట్లో సుమారు ఇరవై నిముషాల పాటు పాము తిరగాడింది. స్థానిక యువకులు ధైర్యం ప్రదర్శించి పామును చంపకుండా పట్టుకుని గ్రామశివారులో వదిలేశారు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాలనీల్లో పేర్కొన్న అపరిశుభ్ర పరిసరాల వల్లే పాములు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సీఎం తలపెట్టిన 30రో జుల ప్రణాళికలో భాగంగానైనా కాలనీని శుభ్రం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment