సాక్షి, హైదరాబాద్: గ్రామీణ విద్యార్థుల సామాజిక వికాసమే లక్ష్యంగా తాము ‘వారధి ఫౌండేషన్’ నెలకొల్పినట్లు ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందా అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్లుగా వారధి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతో న్న ప్రతిభావంతులైన గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో సామాజిక స్పృహ, సంప్రదాయాల పట్ల అవగాహన పెంచడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ, ఏపీలోని 12 జిల్లాల్లో 41 కేంద్రాల ద్వారా వ్యాసరచన, ప్రసంగ పోటీలు నిర్వహిం చి విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతున్నామని పేర్కొన్నారు. విజేతలకు సెప్టెంబర్ 30న రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, సంయుక్త కార్యదర్శి భుజంగరావు పాల్గొన్నారు. ఆసక్తిగల వారు 9676099933, 9849588555 లను సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment