సంఘ బహిష్కరణలపై విచారణకు ఎస్పీ ఆదేశం | SP command to inquiry on community boycott | Sakshi
Sakshi News home page

సంఘ బహిష్కరణలపై విచారణకు ఎస్పీ ఆదేశం

Published Mon, Oct 6 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

SP command to  inquiry  on community boycott

 సంగారెడ్డి : సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలోనే ఉద్యోగులను వేధిస్తున్న సీమాంధ్ర అధికారికి పదోన్నతి కల్పించడం ఎంతవరకు సమంజసమని టీఎన్‌జీఓస్ మహిళా శిశుసంక్షేమశాఖ కేంద్ర ఫోరం అధ్యక్షుడు జైరాం నాయక్ ప్రశ్నించారు. సంగారెడ్డిలో సోమవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివాదాస్పదురాలైన ఐసీడీఎస్ పీడీ (జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ) వై.శైలజ దీర్ఘకాలిక సెలవులో ఉండగానే.. వరంగల్ ఆర్‌జేడీగా నియమించడం సరైంది కాద న్నారు.

ఐసీడీఎస్ డెరైక్టరేట్‌లో ఇప్పటికీ సీమాంధ్రులదే పెత్తనం కొనసాగుతుందని, వారు రింగై పరస్పరం కాపాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే ఆమె అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. శిశు గృహ కౌన్సిలర్‌గా నియమితులైన బాలభారతిని దొడ్డి దారిలో శిశుగృహ మేనేజర్‌గా, గృహహింస చట్టం సోషల్ కౌన్సిలర్‌గా పదోన్నతులు కల్పించిన శైలజ.. తన సీమాంధ్ర పక్షపాత వైఖరిని చాటుకున్నారని ఆరోపించారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మార్చి  10న బాలభారతి విధుల్లో చేరగా ఫిబ్రవరి 28నే ఉద్యోగంలో చేరినట్లు పాత తేదీలలో ఆమె నియామకపు ఉత్తర్వులు జారీ చేయగా, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మెదక్ జిల్లాకే న్యాయం చేయని ఆమె ఆర్‌జేడీ (ఇన్‌చార్జ్)గా నాలుగు జిల్లాలకు  న్యాయం ఎలా చేస్తారని జైరాం ప్రశ్నించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement