స్పీకర్‌కు తప్పిన ప్రమాదం | Speaker missed from accident | Sakshi
Sakshi News home page

స్పీకర్‌కు తప్పిన ప్రమాదం

Published Sun, Jun 10 2018 1:23 AM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

Speaker missed from accident - Sakshi

గణపురం: శాసన సభాపతి మధుసూదనాచారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌పైకి లారీ దూçసుకెళ్లింది. డ్రైవర్‌ అప్రమత్తతో  ప్రమాదం తప్పింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో శుక్రవారంరాత్రి స్పీకర్‌ పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం గణపురంలో  నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభించి తిరిగి భూపాల పల్లికి బయలుదేరారు.

ఈ క్రమంలో గణపసముద్రం చెరువు మత్తడి సమీపంలోకి స్పీకర్‌ కాన్వాయ్‌ చేరుకుంది. గాంధీనగర్‌ నుంచి ములుగు వైపు దేవాదుల పైపులను తీసుకుని ఎదురుగా వస్తున్న లారీ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లింది. స్పీకర్‌ వెనుక వస్తున్న ఎస్కార్ట్‌ డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు దిం పాడు. అంతలో లారీ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు.

వెనకాల వస్తున్న మరో లారీ ముందున్న లారీని ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురై వాహనాలను నిలిపి వేశారు. స్పీకర్‌ వాహనాన్ని పక్క నుంచి మళ్లించారు. కాన్వాయ్‌లోని వాహనానికి, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు, టీఆర్‌ఎస్‌ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement