పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
అభయారణ్యం సమీపంలో పులి మరణంతో ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పులుల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభయారణ్యం సమీపంలోని చింతలపల్లి బీట్ చెన్నూరు రేంజ్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 51లో కరెంట్ ఫెన్సింగ్ బారిన పడి పులి చనిపోరుున విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివిధ పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చిన నేపథ్యంలో సోమవారం అటవీశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పీసీసీఎఫ్ పీకే ఝా తదితర అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైల్డ్‌లైఫ్ క్రై మ్ రికార్డ్ బ్యూరోకు, సంబంధిత సంస్థలకు నివేదికలను పంపినట్లు తెలిపారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కిందిస్థారుు అధికారులను ఉన్నతాధికారులు ఆదేశిం చారు. అడవిపందుల బారి నుంచి తమ పం టలను కాపాడుకునేందుకు గిరిజన రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ ఫెన్సింగ్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అటవీశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అం దింది. జంతువుల వేట, వాటి అక్రమ స్మగ్లింగ్, విలువైన శరీరభాగాల కోసం ఈ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయలేదని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.
నలుగురు రైతుల రిమాండ్
విద్యుత్ షాక్‌కు గురై పులి మరణించడంతో భయపడిన రైతులు దానిని పూడ్చివేసి ఉంటారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇం దుకు కారణమైన ఆత్రం ఎర్రయ్య, ఆత్రం లస్మయ్య, ఆత్రం రాజన్న అనే రైతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పులి శంకర్‌ను ఆదిలాబాద్‌లోని జువెనెల్ హోంకు తరలిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉం డేందుకు ‘ఏనిమల్ ట్రాకర్స్’సంఖ్యను గణనీ యంగా పెంచుకోవాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు దాదాపు నెలన్నర క్రితమే కెమెరాల్లో రికార్డు అరుునా, దాని సంరక్షణకు సంబంధి త అధికారులు చర్యలు తీసుకోలేదు. దీని పైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.