
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’కార్యక్రమానికి మూడో రోజూ విశేష స్పందన లభించింది. శుక్రవారం సెలవు కావటంతో వైద్య శిబిరాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒక్క శుక్రవారమే రికార్డు స్థాయిలో 1,07,361 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో మహిళలు 61 వేలు, పురుషులు 46 వేల మంది ఉన్నారు. ప్రజలు భారీగా తరలివస్తుండటం తో రాత్రి ఏడుగంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించారు.
శిబిరాలు నిర్వహించే ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రతి ఇంటికీ టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లలో సూచించిన సమయానికి రావటం వల్ల వేచిచూసే అవసరముండదని ప్రచారం చేస్తు న్నారు. ప్రభుత్వం ‘కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఈ నెల 15న ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి రెండు రోజుల్లో 1.13 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకోగా..మూడు రోజులకు కలిపి 2.19 లక్షల మంది చేయించుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తు న్నామని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు జి.శ్రీనివాస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment