
హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకోసం జూన్ 25న రాష్ట్రవ్యాప్త ఆటోబంద్‌కు రాష్ట్ర ఆటోడ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో విలేకరులతో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాదిరిగానే తెలంగాణ సీఎం కూడా ఆటోడ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయంతోపాటు మద్యపాన నిషేధం అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆటోడ్రైవర్ సాయినాథ్‌ను హత్యచేసి 40 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సాయినాథ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టుబడ్డ ఐదుమంది నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఆటోడ్రైవర్లు సైతం తమవంతుగా చందాలు వసూలుచేసి జూన్ 15వ తేదీన సాయినాథ్ కుటుంబానికి అందించాలని నిర్ణయించామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.500 ఎంవీ ట్యాక్స్ మినహాయించి చేతులు దులుపుకున్నారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్క ఆటోకు ఇన్సూ్యరెన్స్, బండి రిపేరింగ్ ఖర్చులకు ఏడాదికి రూ.10 వేలు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మద్యపాన నిషేధం అమలు విషయంలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి అభినందనీయుడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment