auto bundh
-
25న రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్
హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంకోసం జూన్ 25న రాష్ట్రవ్యాప్త ఆటోబంద్‌కు రాష్ట్ర ఆటోడ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో విలేకరులతో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాదిరిగానే తెలంగాణ సీఎం కూడా ఆటోడ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సహాయంతోపాటు మద్యపాన నిషేధం అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆటోడ్రైవర్ సాయినాథ్‌ను హత్యచేసి 40 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సాయినాథ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పట్టుబడ్డ ఐదుమంది నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్లు సైతం తమవంతుగా చందాలు వసూలుచేసి జూన్ 15వ తేదీన సాయినాథ్ కుటుంబానికి అందించాలని నిర్ణయించామన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి రూ.500 ఎంవీ ట్యాక్స్ మినహాయించి చేతులు దులుపుకున్నారన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్క ఆటోకు ఇన్సూ్యరెన్స్, బండి రిపేరింగ్ ఖర్చులకు ఏడాదికి రూ.10 వేలు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తామనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మద్యపాన నిషేధం అమలు విషయంలో కూడా జగన్మోహన్రెడ్డి అభినందనీయుడన్నారు. -
నేడు ఆటో, క్యాబ్‌ల బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌లు మంగళవారం బంద్ పాటించనున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తదితర కార్మిక సంఘాలు సైతం సమ్మెకు మద్దతునిస్తున్న నేపథ్యంలో బస్సుల రాకపోకలపై కూడా బంద్ ప్రభావం ఉండనుంది. అయితే ప్రధాన కార్మిక సంఘమైన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) మాత్రం సమ్మెకు దూరంగా ఉండనుంది. ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపనున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. ఎక్కడికక్కడే స్టాప్.. సమ్మె నేపథ్యంలో లక్షకు పైగా ఆటోరిక్షాలు, మరో 50 వేల క్యాబ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా ఓలా, ఊబెర్ క్యాబ్‌లు, 25 వేలకు పైగా స్కూల్ ఆటోలు, వ్యాన్లు కూడా ఆగిపోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మెను కొనసాగించనున్నట్లు ఆటో సంఘాల జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్, సత్తిరెడ్డి.. తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, ప్రతినిధులు ఈశ్వర్రావు, కొండల్‌రెడ్డి ప్రకటనల్లో తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలోని కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తేయాలని.. డ్రైవర్ల భద్రత, సంక్షేమం కోసం డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరగనున్న రైళ్లు.. రైల్వే కార్మిక సంఘాలు సైతం సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నప్పటికీ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా ఉంటాయి. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రధాన రైళ్లతో పాటు, నగరంలోని వివిధ మార్గాల్లో ప్రయాణికులకు సదుపాయం అందజేసే ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే మెట్రో రైళ్లు కూడా యథావిధిగా తిరుగుతాయి. బస్సులపై ప్రభావం.. సమ్మెకు కొన్ని కార్మిక సంఘాలు మద్దతునిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకల పైనా పాక్షికంగా ప్రభావం పడే అవకాశముంది. గ్రేటర్లో ప్రతి రోజూ 3,850 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 32 లక్షల మంది ప్రయాణిస్తారు. బంద్ ప్రభావం కారణంగా ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సమ్మెలో పాల్గొనే సిబ్బంది వల్ల కొన్ని రూట్లలో బస్సులు నిలిచిపోవచ్చు. అయితే సాయంత్రం అన్ని రూట్లలో యథావిధిగా బస్సులు తిరిగే అవకాశం ఉంటుంది. -
ఆటోల బంద్ పాక్షికం
హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనలో భాగంగా చేపట్టిన ఆటోల సమ్మె హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో పాక్షిక ప్రభావం చూపింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోల యజమానులు చేపట్టిన ఒక్క రోజు సమ్మెకు స్పందన నామమాత్రంగానే వచ్చింది. పెంచిన బీమా, ఆర్టీఏ ఫీజులను తగ్గించాలని ఓలా, ఉబెర్ క్యాబ్ సర్వీసులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో భాగంగా ఆటో కార్మికులు హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి రాజ్‌భవన్ వరకు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ర్యాలీని విరమించారు. ఏఐటీయూసీ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ సమ్మెకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలపగా సుమారు లక్ష ఆటోలు రోడ్డెక్కలేదని అన్నారు. ఆటోల సమ్మెతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు బస్సు ట్రిప్పులను పెంచారు. -
16 నుంచి ఆటోలు బంద్
హైదరాబాద్: నగరంలో రవాణా శాఖ యంత్రాంగం తీరుకు నిరసనగా ఆటో యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. ట్రాఫిక్, రవాణా, తూనికలు కొలతల అధికారుల వేధింపులు ఆపాలంటూ ఈ నెల 16 నుంచి ఆటో యూనియన్లు బంద్‌కు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం సంబంధిత శాఖల అధికారులకు యూనియన్ల నాయకులు నోటీసులు అందజేశారు.