![Stoped the Pensions to the 60 years older womens - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/7/ABHAYAHASTAM13.jpg.webp?itok=lNHHHCQT)
సాక్షి, హైదరాబాద్: ఏడాదిగా ‘అభయహస్తం’ అదృశ్యమైంది. మహిళా సంఘాల్లోని 60 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు ఇవ్వడం ఈ అభయహస్తం ఉద్దేశం. ఈ పథకాన్ని సంస్కరించే పేరిట ప్రభుత్వం పింఛన్లు నిలిపి వేసింది. ఈ పథకాన్ని నూతనంగా తీర్చిదిద్దు తారా? లేక అసలే రద్దు చేస్తారా? అన్న అను మానాలు మహిళల్లో నెలకొన్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలో 38 లక్షల మందికి ఆసరా పథకం కింద పింఛన్లు ఇస్తోంది. వీటి కోసం రూ.398 కోట్లు వెచ్చిస్తోంది. ఈ పథకం లబ్ధిదారుల్లో మహిళలు కూడా ఉన్నారు. దీంతో కొందరు మహిళలు ఆసరా, అభయహస్తం కింద రెండు పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అను మానించి అభయహస్తం పింఛన్లు నిలిపి వేసింది. ఏడాదిగా అభయహస్తం రూపు రేఖలు మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సంబంధిత ప్రతిపాదన ఫైలును ప్రభుత్వం వద్దకు పంపినా తుది నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోంది.
పథకంలో సంస్కరణలు...
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న 4.6 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 51 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో 21 లక్షల మంది అభయహస్తం పథకానికి అర్హత కలిగి ఉండగా కేవలం 82 వేల మంది ఏడాది క్రితం వరకు పింఛన్లు పొందారు. పదేళ్లుగా నడుస్తున్న ఈ పథకానికి మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయడంలేదు. ఈ పథకం సంస్కరణల్లో భాగంగా పింఛన్లను పరిమితంగానే ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ఇతర పింఛన్లు తీసుకోని అరవై ఏళ్లు నిండిన మహిళలకు యథావిధిగా ఇవ్వాలని భావిస్తున్నారు.
అలాగే జనశ్రీ బీమా యోజన కవరేజీని రూ.30 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని యోచిస్తున్నారు. పింఛన్ పొందే మహిళతోపాటు ఆమె భర్తకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పించే అవకాశ ముంది. గతంలో సాధారణ మరణానికి బీమా సొమ్ము రూ.70 వేలు మాత్రమే ఉండేది. దీన్ని రూ. 2 లక్షలకు పెంచాలని అభయహస్తం పథకంలో మార్పులు చేసే అవకాశముంది. ప్రమాదాల కారణంగా గతంలో రూ. 2 లక్షలు ఇచ్చేవారు. దాన్ని రూ. 4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment