
తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
ఆత్మకూరు(పరకాల): తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని డీసీపీ ఇస్మాయిల్ అన్నారు. మండలంలోని గూడెప్పాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా డీసీపీ ఇస్మాయిల్ వాహనదారులకు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
మద్యం సేవించడం వల్ల వాహనాలను అతివేగంగా నడుపుతారని దీంతో ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నామని కేసులు పెట్టి జైలుకు కూడా పంపుతున్నామని చెప్పారు. హైవే పైన ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.