పరీక్షలో తప్పానని.. విద్యార్ధి ఆత్మహత్య
Published Sat, Jun 4 2016 9:47 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పోచమ్మమైదాన్ (వరంగల్): పరీక్షలో ఫెయిల్ అయ్యాయనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురంనకు చెందిన పులి శంకర్, సులోచన దంపతులు వరంగల్ బ్యాంక్ కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు కార్తీక్(20) హైదరాబాద్‌లోని బ్రిలియంట్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు.
దీంతో మానస్తాపానికి గురైన కార్తీక్ మూడు రోజులుగా సరిగా అన్నం తినకుండా, ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నాడు. కార్తీక్ ఇంటి సమీపంలోనే అతని సోదరి స్రవంతి ఉంటోంది. శనివారం స్రవంతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కార్తీక్ అక్కడికి వెళ్లి ఉరి వేసుకున్నాడు. కార్తీక్ కోసం వెతకగా, స్రవంతి ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించాడు. కన్న కొడుకు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు.
Advertisement
Advertisement