దుఃఖంలోనూ ‘పరీక్ష’ | student father die still he's coming writing exam | Sakshi
Sakshi News home page

దుఃఖంలోనూ ‘పరీక్ష’

Published Fri, Mar 25 2016 2:08 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

దుఃఖంలోనూ ‘పరీక్ష’ - Sakshi

దుఃఖంలోనూ ‘పరీక్ష’

 తండ్రి చనిపోయినా ఎగ్జామ్ రాసిన విద్యార్థి
ఇబ్రహీంపట్నం రూరల్: తండ్రి మరణించడంతో దు:ఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పరీక్ష రాశాడు. గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నానికి చెందిన భర్తాకి త్రిలోక్‌వర్మ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివి పరీక్షలు రాస్తున్నాడు. త్రిలోక్‌వర్మ తండ్రి కుటుంబ కారణాలవల్ల బుధవారం సాయంత్రం కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి పెద్దకూమారుడు త్రిలోక్‌వర్మ తండ్రి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. అయితే గురువారం పదో తరగతి హిందీ పరీక్ష రాయాల్సి ఉండడంతో దు:ఖాన్ని దిగమింగుకుంటూ స్థానిక ఉర్దూ రెసిడెన్సియల్ పాఠశాలలో పరీక్ష రాశాడు. త్రిలోక్‌వర్మ చదువుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింహ అతడిని ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. సాయంత్రం జరిగిన తండ్రి అంత్యక్రియల్లో త్రిలోక్‌వర్మ పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement