విద్యార్థి ఆత్మహత్య | Student dies for his heart pain | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆత్మహత్య

Published Tue, Jun 30 2015 1:23 AM | Last Updated on Tue, Nov 6 2018 8:22 PM

విద్యార్థి ఆత్మహత్య - Sakshi

విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : ‘బాపు.. నాకు బతకాలని ఉండేది.. కానీ నా ఆశయం నెరవేరకుండానే చనిపోతున్నందుకు బాధగా ఉంది. నేను చనిపోతున్నందుకు గుండె నొప్పే కారణం..ఆ భారం మీ పై పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నా.. నన్ను క్షమించండి.. అంటూ ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు.ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భిక్కనూర్ మండలం, జంగంపల్లికి చెందిన చిట్టబోయిన నర్సింహ ముదిరాజ్, శ్యామలలు వ్యవసాయదారులు.

వీరికి ఓం ప్రకాశ్(18), సుమేదలు సంతానం. ఓం ప్రకాశ్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కశాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు.ఆదివారం అర్థరాత్రి వరకు చదువుకున్న ఓం ప్రకాశ్  సోమవారం ఉదయం తన గదిలో టవల్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓం ప్రకాశ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.

కాగా తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని, తోటి విద్యార్థులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల యాజమాన్యం మృతుని కుటుంబానికి  రూ.10 లక్షల చెక్కును అందజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement