4 జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
* కేంద్రానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ
* ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక్కో దానికి రూ. 250 కోట్లు
* ఆరోగ్య యూనివర్సిటీ నిర్మాణానికి రూ. 160 కోట్లు
* ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మంజూరు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆ శాఖ సమగ్ర ప్రతిపాదనలు తయారుచేసింది. ప్రభుత్వం పం పే వివిధశాఖల ప్రతిపాదనల తో వీటినీ శుక్రవారం కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని ప్రతిపాదనల్లో అధికారులు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మం జూరు చేయాలని కోరారు.
వాటికి అనుబంధం గా 4 మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరా రు. ఒక్కో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ. 250 కోట్లు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆయా జిల్లాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశంతో పాటు ప్రభుత్వ మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ 6 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు ఒక్కో దానికి రూ. 4.5 కోట్లు విడుదల చేయాలని, వాటిని 30 పడకల ఆస్పత్రులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొన్నిం టిని ఆధునీకరించి ఉన్నట్లయితే వాటిని ఈ ప్రతి పాదనల నుంచి మినహాయిస్తారు. ఆరు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏరియా ఆస్పత్రులను కొత్తగా ఏర్పాటు చేయాలని కోరా రు. కొన్ని చోట్ల ఇప్పటికే ఉన్నట్లయితే ప్రతిపాదనల్లో వాటిని మినహాయించారు. వరంగల్‌లో ఆరోగ్య వర్సిటీ భవన నిర్మాణానికి రూ. 160 కోట్లు కేటాయించాలని కూడా ప్రస్తావించారు.