super-specialty hospitals
-
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ సమ్మెబాట
- నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటన -130 ఆస్పత్రులకు సర్కారు రూ.330 కోట్లు బకాయి - రూ.100 కోట్లు చెల్లించేందుకు అంగీకారం - ఒప్పుకోని ఆస్పత్రుల యాజమాన్యాలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ ‘సమ్మె’ బాట పట్టాయి. ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే గత నాలుగు రోజుల నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని అన్ని ప్రైవేట్ అండ్ నర్సింగ్ హోమ్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునేందుకు వచ్చిన రోగులు సేవలు అందక విలవిల్లాడుతున్నారు. ఐదు మాసాలు.. రూ.330 కోట్లు : రాష్ట్రంలో 190 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో పేర్లు నమోదు చేసుకున్నాయి. వాటిలో 60 ప్రభుత్వ ఆస్పత్రులు ఉండగా, 120 ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి. మరో పది సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 30 శాతం సర్వీసులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతుంటే 70 శాతం సేవలు ప్రైవేటు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందిస్తున్నాయి. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగుల బిల్లులను ప్రభుత్వం ఐదు నెలలుగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.330 కోట్లకు చేరాయి. వీటిని వెంటనే చెల్లించాలంటూ రెండు నెలల కిందట ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆయా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసింది. స్పందించిన ప్రభుత్వం తక్షణమే రూ. 80 కోట్లు చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటివరకు రూ.30 కోట్లే చెల్లించింది. ప్రభుత్వం హామీని నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ జూన్ 30 నుంచి ఆయా ఆస్పత్రుల్లో సర్వీసులు నిలిపేసింది. ప్రైవేటు హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ ఆందోళన బాట పట్టగాసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మాత్రం సేవలు కొనసాగించాయి. నేటి నుంచి సేవలు బంద్: టీశా రోగులకు ఇబ్బంది కలుగుతుండటంతో స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించారు. తక్షణమే రూ.100 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. అయినా ఆస్పత్రులు పట్టు వీడలేదు. ఆదివారం సమావేశమై భవిష్యత్తు కార్యచరణ రూపొందించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల బాటలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులూ నడుస్తాయని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీశా) ప్రకటించింది. సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు టీశా అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్‌రావు స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో కుదుర్చుకున్న ఎంవోయూను సమీక్షించి పెరిగిన చార్జీలకు అనుగుణంగా టారిఫ్‌ను పెంచాలని ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ కన్వీనర్ సురేశ్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు రోజుల నుంచి పడిగాపులు కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో ఆరోగ్యశ్రీ కింద సర్జరీ కోసం రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చా. తొలి రోజు ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్నామని చెప్పారు. మరుసటి రోజు కూడా వచ్చా. చేర్చుకోవడం కుదరదని చెప్పారు. సొంతూరుకు వెళ్లలేక మూడు రోజుల నుంచి ఆస్పత్రి సెల్లార్లోనే తలదాచుకుంటున్నా. - నర్సింహ, కల్వకుంట్ల, నల్లగొండ జిల్లా -
4 జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
* కేంద్రానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ * ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక్కో దానికి రూ. 250 కోట్లు * ఆరోగ్య యూనివర్సిటీ నిర్మాణానికి రూ. 160 కోట్లు * ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆస్పత్రి సాక్షి, హైదరాబాద్: ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మంజూరు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఆ శాఖ సమగ్ర ప్రతిపాదనలు తయారుచేసింది. ప్రభుత్వం పం పే వివిధశాఖల ప్రతిపాదనల తో వీటినీ శుక్రవారం కేంద్రానికి పంపే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో మెరుగైన వైద్య సేవలందించాలని ప్రతిపాదనల్లో అధికారులు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు మం జూరు చేయాలని కోరారు. వాటికి అనుబంధం గా 4 మెడికల్ కాలేజీలు కేటాయించాలని కోరా రు. ఒక్కో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ. 250 కోట్లు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆయా జిల్లాల్లో అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశంతో పాటు ప్రభుత్వ మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ 6 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణకు ఒక్కో దానికి రూ. 4.5 కోట్లు విడుదల చేయాలని, వాటిని 30 పడకల ఆస్పత్రులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కొన్నిం టిని ఆధునీకరించి ఉన్నట్లయితే వాటిని ఈ ప్రతి పాదనల నుంచి మినహాయిస్తారు. ఆరు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏరియా ఆస్పత్రులను కొత్తగా ఏర్పాటు చేయాలని కోరా రు. కొన్ని చోట్ల ఇప్పటికే ఉన్నట్లయితే ప్రతిపాదనల్లో వాటిని మినహాయించారు. వరంగల్‌లో ఆరోగ్య వర్సిటీ భవన నిర్మాణానికి రూ. 160 కోట్లు కేటాయించాలని కూడా ప్రస్తావించారు. -
నగదు రహిత చికిత్సలకు నిరాకరించే ఆస్పత్రుల పై వేటు
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధి నుంచి తొలగిస్తాం మంత్రి డాక్టర్ రాజయ్య హెచ్చరిక సాక్షి, హైదరాబాద్ : నగదు రహిత చికిత్సలకు నిరాకరించే సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధి నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత పథకం కింద చికిత్స అందించేందుకు 230 ఆస్పత్రులు ముందుకు రాగా, మరో 12 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయన్నారు. ప్యాకేజీకన్నా అదనంగా 25శాతం ఇవ్వాలని కోరుతున్నాయన్నారు. అవి నవంబర్ చివరికల్లా నెట్వ ర్క్ పరిధి లోకి రాకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జూబ్లీహిల్స్ ఆరోగ్యశ్రీ కేంద్ర కార్యాలయంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రుల వైఖరి వల్ల ఉద్యోగులకు ఇబ్బంది రాకుండా నవంబర్ 30 వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. జూడాలూ సహనంగా ఉండండి: రాజయ్య జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనిడిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. వారు కోరుతున్నట్లు శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికీ సిద్ధమేననీ అయితే కమలనాధన్ కమిటీ మార్గదర్శకాలు రావాలని అప్పటి వరకు సహనంతో ఉండాలని జూడాలకు సూచించారు. ఇప్పటికైనా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఇఓ ధనుంజయ్‌రెడ్డి, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాకొక మెడికల్ కళాశాల
సీఎం సిద్ధరామయ్య ఐదు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాలతో పాటు ఐదు ప్రాంతాల్లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం చేరువ చేసేందుకు వీలుకలుగుతుందని అన్నారు. బెంగళూరులోని జయదేవ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు అత్యాధునిక కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్‌లను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాకొక మెడికల్ కళాశాల ఏర్పాటు వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. మైసూరు, గుల్బర్గా, హుబ్లీ, బళ్లారి, బెల్గాంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించనున్నట్లు చెప్పారు. జయదేవ ఆస్పత్రి డెరైక్టర్ సి.ఎన్.మంజునాథ్ మాట్లాడుతూ దేశంలో ఏడు క్యాథలిక్ ల్యాబ్‌లు ఉన్న వైద్య సంస్థ తమదేనని తెలిపారు. నిరుపేదలకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అత్యాధునిక వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మైసూరులో 350 పడకల సామర్థ్యం గల మరోశాఖను రెండేళ్లలో ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.