ఖమ్మం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరక నిలిచిపోయిన ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయింది. దీంతో ఇంతకాలం ఎదురుచూసిన విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక సర్టిఫికెట్లు సర్ధుకునే పనిలో విద్యార్థులు, తమ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే పనిలో కళాశాలల నిర్వాహకులు నిమగ్నమయ్యారు.
అయితే కౌన్సెలింగ్ ఉమ్మడిగా నిర్వహిస్తారా..? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు వేర్వేరుగా నిర్వహిస్తాయా ..? అనేది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే షెడ్యూల్‌పై ఆధారపడి ఉంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే షెడ్యూల్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
తొలగిన అయోమయం..
ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వచ్చాయి.. మంచి ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల్లో చేరాలని కలలు కంటున్న విద్యార్థులు ఇంతకాలం అయోమయంలో పడ్డారు. కౌన్సెలింగ్ నిర్వహించేం దుకు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయగా.. ‘ఆ షెడ్యూల్‌తో మాకు సంబంధం లేదు. మేమే సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించుకుంటాం’ అని తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో కౌన్సెలింగ్‌కు హాజరు కావా లా...? వద్దా..? అనే డైలమాలో జిల్లా విద్యార్థులు పడ్డారు.
దీనికి తోడు ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి, సౌకర్యాలు, అర్హతలపై ఇంకా తేల్చలేదని, కళాశాలల పరిశీలన అనంతరం బోగస్ కాలేజీలను తొలగించి తెలంగాణ విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని, అప్పటి వరకు సహనం పాటించాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి చేసిన ప్రకటనతో జిల్లాలో పలు ఇంజనీరింగ్ కళాశాలల యజమాన్యాల్లోనూ వణుకు మొదలైంది.
ఇరు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ ‘ఎంసెట్’ యుద్ధం ఎప్పుడు ఏ పరిణామాలకు దారి తీస్తుందో.. ఎవరు నష్టపోవాల్సి వస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆదేశించడం, ఆ ఆదేశాలను పాటిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది.
‘1956’పై జిల్లా విద్యార్థులకు సడలింపు అవసరం..!
తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో ఒక తీరైతే ఖ మ్మం జిల్లాలో మరోతీరుంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జిల్లా కావడంతో పాటు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తున్నాయి. భద్రాచలం, పాల్వంచ డి విజన్లలోని పలు గ్రామాలు 1956కు ముందు ఆం ధ్రప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితులతో 1956ను ప్రామాణికంగా తీసుకొని స్థానికతను ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకంటే జిల్లా విద్యార్థులు అధికంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. భద్రాచలం, పాల్వంచలోని పలు ప్రాం తాల విద్యార్థులు ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం తదితర కళాశాలల్లో విద్యనభ్యసించారు. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతుండడంతో వారి స్థానికత ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభత్వం ప్రకటించిన ఫాస్ట్ పథకం అమలుకు ధ్రువీకరణ పత్రాల జారీ బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అయితే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు, స్థాని కులు మొదలైన సర్టిఫికెట్ల జారీలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పుడు ఈ విషయంలో కూడా రెవెన్యూ అధికారులు తమను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలా మిగిలిన జిల్లాలతో ఖ మ్మం జిల్లాను కలిపితే ఇబ్బందేనని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. స్థానికత విషయంలో ఇత ర జిల్లాలతో సమానంగా కాకుండా ఖమ్మం జిల్లా విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలని, నిబంధనలు సడలించాలని జిల్లా ప్రజలు కోరుతున్నా రు. ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్‌లో ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
విద్యార్థుల వేటలో కళాశాల యాజమాన్యాలు...
ఎసెంట్ కౌన్సెలింగ్‌పై ఉత్కంఠకు తెరపడటంతో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల వేటలో పడ్డాయి. జిల్లాలో 23 ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 13 వేల సీట్లు ఉన్నాయి. గత సంవత్సరం జిల్లాలో ఒకటి, రెండు కళాశాలల్లో మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో కళాశాలలు మూత పడే ప్రమాదం ఏర్పడింది. అయితే అప్పుడే పాలిటెక్నిక్, ఇతర కోర్సు లు రావడం, విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరడంతో పలు కళాశాలల యాజమన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఇక ఈ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే కళాశాలల వసతులు, ఇతర సదుపాయాలు, భవనాలు, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య మొదలగు వివరాలను అధికారులు తనిఖీ చేశా రు. ఈ నిబంధనలు పాటించని కళాశాలలపై వేటుపడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఈ సంవత్సరమైనా విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. మరికొన్ని కళాశాలల యాజమాన్యాలు బీహార్ తదితర రాష్ట్రాల నుంచి విద్యార్థులను చేర్పించుకునే పనిలో పడ్డాయి.
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు లైన్‌క్లియర్
Published Tue, Aug 12 2014 2:18 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement