నేడు రిలీవ్ కానున్న ‘భట్టాచార్య’ | Sutirtha Bhattacharya Reliv today | Sakshi
Sakshi News home page

నేడు రిలీవ్ కానున్న ‘భట్టాచార్య’

Published Sat, Dec 27 2014 1:59 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

నేడు రిలీవ్ కానున్న ‘భట్టాచార్య’ - Sakshi

నేడు రిలీవ్ కానున్న ‘భట్టాచార్య’

గోదావరిఖని(కరీంనగర్) : కోల్‌ఇండియా చైర్మన్‌గా నియమితులైన సుతీర్థ భట్టాచార్య శనివారం సింగరేణి సీఎండీ విధుల నుంచి రిలీవ్ కానున్నారు. అలాగే ఈనెల 30 లేదా 31వ తేదీన కోల్‌ఇండియా సీఎండీగా బొగ్గు శాఖ అదనపు కార్యద ర్శి ఏకే.దూబే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన భట్టాచార్య గడిచిన రెండేళ్లుగా సింగరేణి సీఎండీగా పనిచేస్తున్నారు.

కోల్‌ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన 1986 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు గత ఏడాది మే నెలలో కోల్‌ఇండియా సీఎండీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడంతో బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. బొగ్గు పరిశ్రమపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు 2015 జనవరి 6వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కోల్‌ఇండియాలో సమ్మె చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం భట్టాచార్యను వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఆయన 30 లేదా 31వ తేదీల్లో సీఐఎల్ సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే శనివారం రిలీవ్ కానున్న భట్టాచార్యను హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘాలు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ నాయకులు ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement