దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘స్వచ్ఛ భారత్’
ముగిసిన స్వచ్ఛ తెలంగాణ వారోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇండియా గేట్ మార్గంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాత్ముడు కలలుకన్న పరిశుభ్ర భారతావనిని ఐదేళ్లనాటికి ఆయున 150వ జయంతికల్లా సాధించాలనే లక్ష్యంతో ప్రధాని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే లక్ష్యంతో వారం రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ‘స్వచ్ఛ తెలంగాణ’ వారోత్సవాలను ప్రారంభించి ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభమయ్యే సమయానికి ముగించడం విశేషంగా మారింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25న ప్రారంభించిన స్వచ్ఛ తెలంగాణ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి.
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాల్లో గత వారం రోజులుగా వివిధ రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు బడులు, ఆస్పత్రులు, కార్యాలయాలు, సామూహిక మరుగుదొడ్లు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల పరిసర ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో తొలి ఆరు రోజులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమం ఇలా సాగింది...: 534 కిలోమీటర్ల రోడ్లు, 507 కిలోమీటర్లమేర మురికి కాల్వలు శుభ్రం 21,155 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు పాలుపంచుకున్న వ్యక్తులు 28,129 మంది
అటు ప్రారంభం.. ఇటు ముగింపు
Published Fri, Oct 3 2014 12:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement