సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఇద్దరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయినట్టు వైద్యులు గుర్తిం చారు. వీరిలో ఒకరు అపోలో, మరొకరు ప్రీమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేర్, యశోద ఆస్పత్రుల్లోనూ కొందరికి హెచ్1ఎన్1 లక్షణాలున్నట్టు అనుమానం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, స్వైన్‌ఫ్లూ కాదని తేలింది. ఈ ఏడాది ఇప్పటివరకూ 45 కేసులు స్వైన్‌ఫ్లూ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. 9 మంది మృతి చెందినట్టు వైద్యాధికారులు వెల్లడించారు.