జిల్లాలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా తాజాగా జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు.
నల్లగొండ టౌన్ : జిల్లాలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా తాజాగా జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. నల్లగొండ పట్టణంలోని బోయవాడకు చెందిన కె.రమేష్(35) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో నాలుగు రోజుల క్రితం నల్లగొండకు వచ్చాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరీ క్షించిన వైద్యులు అతనికి స్వైన్‌ఫ్లూ ఉందన్న అనుమానంతో శుక్రవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ఫ్లూగా తేలింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. తొలుత మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రసాద్ అనే ప్రభుత్వ ఉద్యోగి మరణించగా పెద్దవూర మండలంలో అనసూర్య అనే మహిళ కూడా స్వైన్‌ఫ్లూతో మృత్యువాతపడింది. తాజాగా రమేష్ చనిపోయాడు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలి పారు. ఇదిలా ఉండగా స్వైన్‌ఫూ ్లతో మృతి చెందిన రమేష్ ఇంటికి బంధువులు, సంబంధికులెవ రూ రాలేదు. స్వైన్‌ఫ్లూ తమకేడ వస్తుందన్న భయంతోనే రానట్లు తెలిసింది.