అసత్య ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగం కలిగించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై చట్టపరంగా చర్య లు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి న్యాయమూర్తిని కోరారు.
- న్యాయమూర్తి ఎదుట మంత్రి జగదీశ్‌రెడ్డి వాంగ్మూలం
నకిరేకల్: అసత్య ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగం కలిగించడంతోపాటు తెలంగాణ ప్రభుత్వంపై నిందలు వేసిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై చట్టపరంగా చర్య లు తీసుకోవాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి న్యాయమూర్తిని కోరారు. శుక్రవా రం నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిఫ్‌కోర్టులో న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్ ఎదు ట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పొన్నంపై గురువారం సూర్యాపేట కోర్టులో కేసు దాఖలు చేశానని, సూర్యాపేట న్యాయమూర్తి కూడా నకిరేకల్ కోర్టుకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నందున ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.