తప్పుడు ప్రచారం మానుకోవాలి: తలసాని
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల పెంపుపై తప్పుడు ప్రచారం మా నుకోవాలని, ప్రజలను అయోమయానికి గురిచేయొద్దని ప్రతి పక్షాలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హితవు పలికారు. బీసీ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల సమస్యలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించిందని.. ఆ నివే దికలోని అంశాలనే సీఎం ప్రస్తావించారని తెలిపారు. గురు వారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. కులాలు, మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని, మతాల పేరుతో రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. దేశంలోని రాష్ట్రాల పరిస్థితులపై అవగాహన లేకుండా బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.