మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు | telangana assembly budjet sessions starts from march 7th | Sakshi
Sakshi News home page

మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Published Sat, Feb 21 2015 7:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

telangana assembly budjet sessions starts from march 7th

హైదరాబాద్: వచ్చే నెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 11గం.లకు బడ్జెట్ ను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించిన అనంతరం సమావేశాలు ఆరంభమవుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీ నుంచి 27వరకూ నిర్వహించనున్నారు.

 

అయితే మార్చి 8వ తేదీ ఆదివారం కూడా తెలంగాణ అసెంబ్లీ పనిచేయనుంది. 8,9,10 తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చి 11వ తేదీన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ మరసటి రోజు అసెంబ్లీకి సెలవు కాగా, 13,14, 16 తేదీల్లో బడ్జెట్ పై చర్చించిన అనంతరం 17 వ తేదీన బడ్జెట్ పై ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. మార్చి 21,22 వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు. 23 వ తేదీ నుంచి సాధారణ అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement