సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి రాష్ట్రంలో సుమారుగా 67.7% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చిత మైన గణాంకాలను శనివారం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పేర్కొన్నారు.
2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 % పోలింగ్ నమోదుకాగా ఈసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చునన్నారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా మిగిలిన 106 స్థానాల్లో 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని లైన్లలో నిలబడిన ఓటర్లకు అదనపు సమయంలో ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు.
గంట ఆలస్యంగా ప్రారంభం...
షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 4 లేదా 5 గంటల వరకు పోలింగ్ జరగా ల్సి ఉండగా ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 6.45 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును పరీక్షించిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. మాక్ పోలింగ్‌లో ఈవీ ఎంలతోపాటు ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.
చెదురుమదురు ఘటనలు మినహా...
చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగైదు చోట్ల స్వల్ప ఘర్షణలతో ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం6 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్ అధికారులు, 37,556 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 1,50,023 మం ది సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన అనంత రం పోలింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మ« ధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
భారీగా ఓట్లు గల్లంతు!
ఓటర్ల జాబితాలో అడ్డగోలుగా పేర్లను తొలగించడంతో శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది పౌరు లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరసన తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులొచ్చాయి. ఓటర్ల జాబితాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి 2015లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమంలో భాగంగా బోగస్ ఓటర్ల పేరుతో దాదాపు 20 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల పేర్ల తొలగింపులో పొరపాట్లు జరిగాయని సీఈఓ రజత్‌కుమార్ అంగీకరించారు.
ఓటు హక్కు వియోగించుకున్న ప్రముఖులు
Comments
Please login to add a commentAdd a comment