
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల(సెప్టెంబర్) 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో వరుసగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 9న తొలిరోజున శాసనసభలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. కాగా ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడిగా, వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న విషయం విదితమే. విద్యుత్తు కొనుగోళ్ళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై తారస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment