
తెలంగాణలో కారుదే పీఠం!
66 నుంచి 80 ఎమ్మెల్యే సీట్లు
ఎన్‌డీ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్పష్టమైన మెజార్టీతో టీఆర్‌ఎస్ అధికారాన్ని కైవసం చేసుకోనుందని ఎన్‌డీటీవీ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. ఎంపీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌దే హవా అని పేర్కొంది. టీఆర్‌ఎస్ ఏకం గా 66 నుంచి 80 అసెంబ్లీ సీట్ల వరకూ సాధిం చి ఆధిక్యంలో నిలవనుందని తెలిపింది. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ఎన్‌డీటీవీ బుధవారం వెల్లడించింది. కాంగ్రెస్ కేవలం 18 నుంచి 30 అసెంబ్లీ సీట్లను, టీడీపీ కూటమి 8 నుంచి 16 అసెంబ్లీ సీట్లను మాత్రమే సాధించనుందని పేర్కొం ది.
ఇతరులు కూడా 8 నుంచి16 సీట్లను సాధిస్తారని తెలిపింది. ఎంపీ సీట్లలోనూ టీఆర్‌ఎస్ 11 (9 నుంచి 13) పార్లమెంట్ స్థానాలను సాధించనుండగా, కాంగ్రెస్ మాత్రం 3 పార్లమెంట్ సీట్లకే పరిమితం కానుందని వివరించింది. 2009తో పోలిస్తే కాంగ్రెస్ ఏకంగా 9 సీట్లను కోల్పోనుందని తెలిపింది.