
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. పదేళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ను ప్రొటెం స్పీకర్ కె. జానారెడ్డి అభినందించారు. కేసీఆర్ తర్వాత ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి. రాజయ్య, మంత్రి ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా సభ్యులు ప్రమాణం చేస్తున్నారు.
సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఫ్లోర్ లీడర్లతో కేసీఆర్ భేటీ కానున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై చర్చించనున్నారు. ఫ్లోర్ లీడర్ల సహకారాన్ని కేసీఆర్ కోరనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మల్యే మధుసూదనాచారి నామినేషన్ దాఖలు చేయనున్నారు.