
'భద్రాచలం రామయ్యకు ముంపు ముప్పు'
హైదరాబాద్: ప్రస్తుత డిజైన్‌తో ప్రాజెక్టు నిర్మిస్తే భద్రాచలం రామాలయం మునుగుతుందని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. గిరిజన చట్టాన్ని ఉల్లంఘించి పోలవరాన్ని నిర్మించలేరని ఆమె స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలుపుకుని పోలవరం డిజైన్ మార్చాలని న్యాయపోరాటం చేస్తామని ఆమె చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాల్సిందేనని తెలంగాణ శాససభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాలు మునిగిపోకుండా ప్రాజెక్టును నిర్మించాలని ప్రధానిని కోరేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళతామని చెప్పారు. పోలవరం బిల్లు ఆపేందుకు కేసీఆర్ తీసుకున్న చర్యలేంటని ఆయన ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదని, కేసీఆర్ ఈ అంశంపై మౌనంగా ఉన్నారని అడిగారు.
కేబినెట్‌లో సీఎం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేబినెట్‌లో పోలవరం నిర్మాణంపై నిరసన తీర్మానం చేయాలని సూచించారు.