పాలనలో వెనుకబాటే | telangana got 20th rank in public affairs centre index | Sakshi
Sakshi News home page

పాలనలో వెనుకబాటే

Published Tue, May 16 2017 3:14 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM

పాలనలో వెనుకబాటే

పాలనలో వెనుకబాటే

పబ్లిక్‌ ఎఫైర్స్‌ సెంటర్‌ ఇండెక్స్‌లో తెలంగాణకు 20వ స్థానం..
14వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌
‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ టాప్‌.. ఏపీ లాస్ట్‌


సాక్షి, న్యూఢిల్లీ: పాలనాపరమైన అంశాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని పబ్లిక్‌ ఎఫైర్స్‌ సెంటర్‌ విడుదల చేసిన ఇండెక్స్‌ తేల్చింది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 10 అంశాలను నేపథ్యంగా తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాల పాలనా తీరుపై ఇటీవల పబ్లిక్‌ ఎఫైర్స్‌ ఇండెక్స్‌–2017ను విడుదల చేసింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, గుజరాత్‌ తొలి మూడు స్థానాల్లో నిలవగా... తెలంగాణ 20వ స్థానంలో ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ కూడా పాలనాపరమైన అంశాల్లో వెనుకబడే ఉంది. ఈ ఇండెక్స్‌లో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. 10 నేపథ్యాలు, 26 కీలక విషయాలు, 82 సూచికల ఆధారంగా ఈ సంస్థ మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించింది.

అవసరమైన మౌలిక వసతులు, మానవ అభివృద్ధికి మద్దతు, సామాజిక రక్షణ, మహి ళలు–పిల్లలు, న్యాయ పరిష్కార సేవలు, నేరా లు–శాంతిభద్రతలు, పర్యావరణం, పారదర్శ కత–జవాబుదారీతనం, ద్రవ్య నిర్వహణ, ఆర్థి క స్వేచ్ఛ అంశాలతో కూడిన 10 నేపథ్యాలను పరిశీలించి ర్యాంకులు ఇచ్చింది. రెవెన్యూ లోటు, మిగులు, ద్రవ్య మిగులు, రుణ భారం, తలసరి అభివృద్ధి వ్యయం, రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం పెరుగుదల తదితర విషయా లతో కూడిన ‘ద్రవ్య నిర్వహణ’లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుంది. ఏపీ 28వ స్థానంలో నిలిచింది.

ఏ అంశంలో ఏ స్థానం..!
పారిశ్రామిక ఒప్పందాలు, సులభతర వాణిజ్యం, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన తదితర అంశాలను పరిశీలించిన ‘ఆర్థిక స్వేచ్ఛ’లో తెలంగాణ 2వ స్థానంలో, ఏపీ 4వ స్థానంలో నిలిచాయి.
విద్యుత్తు, నీళ్లు, రోడ్లు, గృహ నిర్మాణం తదితర ‘అవసరమైన మౌలిక వసతులు’ అంశంలో ఏపీ 6, తెలంగాణ 14వ స్థానంలో నిలిచాయి.
విద్య, ఆరోగ్యం తదితర అంశాలతో కూడిన ‘మానవ అభివృద్ధికి చేయూత’లో ఏపీ 17, తెలంగాణ 26వ స్థానం దక్కాయి.
ప్రజాపంపిణీ వ్యవస్థ, సామాజిక న్యాయం–సాధికారత, మైనారిటీల సంక్షేమం, ఉపాధి కల్పన తదితర ‘సామాజిక భద్రత’ అంశంలో ఏపీ 24, తెలంగాణ చివరన 30వ స్థానంలో నిలిచాయి.
పిల్లలపై నేరాలు, బాలకార్మికులు, ఐసీడీఎస్‌ లబ్ధిదారుల శాతం, లింగ నిష్పత్తి, పౌష్టికాహార లోపం, ఆసుపత్రుల్లో ప్రసవాలు తదితర మహిళలు–పిల్లలు’ అంశంలో ఏపీ 19, తెలంగాణ 21వ స్థానంలో ఉన్నాయి.
►  అత్యాచారాలు, హత్యలు, వరకట్న బాధిత చావులు, కస్టోడియల్‌ మరణాలు, పోలీసు సిబ్బంది సంఖ్య తదితర విషయాలను పరిశీలించే ‘నేరాలు, శాంతిభద్రతలు’ అంశంలో ఏపీ 11, తెలంగాణ 21 స్థానంలో నిలిచాయి.
►  కేసుల పెండెన్సీ, న్యాయాధికారుల ఖాళీలు, అండర్‌ ట్రయల్‌ ఖైదీల సంఖ్య తదితర అంశాలతో కూడిన ‘న్యాయ సేవల పరిష్కారం’లో ఏపీ 23, తెలంగాణ 21వ స్థానాలతో వెనకపడ్డాయి.
►  కాలుష్యం, పర్యారణ ఉల్లంఘనలు, అటవీ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి వంటి అంశాలున్న ‘పర్యావరణం’లో ఏపీ 20, తెలంగాణ 28వ స్థానంలో నిలిచాయి.
►  ఈ–గవర్నెన్స్‌ సేవలు, ఆర్‌టీఐ, లోకాయుక్త చట్టం, ఏసీబీ కేసుల పరిష్కారం, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ రికార్డులు తదితర విషయాలపై పరిశీలన చేసిన ‘పారదర్శకత, జవాబుదారీతనం’ అంశంలో ఏపీ 23, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement