సాక్షి, హైదరాబాద్: మీ–సేవ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. లాక్‌డౌన్ కారణంగా గత నెలన్నర రోజులుగా మూతపడ్డ ఈ కేంద్రాలను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. రవాణా, రిజిస్ట్రేషన్ల శాఖల కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమైనందున మీ–సేవ కేంద్రాలకు కూడా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆ శాఖ కమిషనర్ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వం అంగీకరించింది.
కంటెన్మైంట్ జోన్ల పరిధిలో మాత్రం ఆంక్షలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయాలని, కనీసం ఒక ఆధార్ ఆపరేటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వరరావు ఆదేశించారు. సిబ్బంది కచ్చితంగా భౌతికదూరం పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతి నమోదుకు ముందు బయోమెట్రిక్‌ను శానిటైజర్‌తో క్లీన్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment