సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు. త్వరలోనే ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. డీఎస్సీ పోస్టుల భర్తీకి అవసరమైన నిబంధనలను సర్కారు మంగళవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్‌కు 20శాతం వెయిటేజ్‌ను ప్రకటించింది. డీఎస్సీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. కొత్త టీచర్లను నియమించే అధికారాన్ని డీఈవోలకు కట్టబెట్టింది. అంతేకాకుండా డీఎస్సీ నియామకాలకు సంబంధించి పీటముడిగా భావించిన.. జిల్లాల పునర్విభజన అంశానికి సైతం ప్రభుత్వం తెరదించింది. కొత్త జిల్లాల ప్రకారమే డీఎస్సీ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment