* ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులతో నగర, పురపాలక సంస్థల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల ప్రతిపాదనల తయారీలో ఎక్కడికక్కడ పాలక వర్గాలకు భాగస్వామ్యం కల్పించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషీ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు నిధుల కేటాయింపులు, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తీర్మానాలను ఆమోదిస్తూ బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
స్థానిక సంస్థల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రూ. 268.01 కోట్ల నిధులు విడుదల చేయగా.. రూ. 267.67 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీలు పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2011-12 నుంచి నాలుగేళ్లుగా విడుదలైన నిధులతో ఇప్పటికే మంజూరైన పనులను రద్దు చేసి కొత్త పనులు చేపట్టేందుకు అనుమతులు జారీ చేసే అధికారాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డెరైక్టర్కు ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేయనుంది.
నిధుల వినియోగంలో ‘స్థానిక’ భాగస్వామ్యం
Published Thu, Aug 28 2014 2:20 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM
Advertisement