సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మరో వారంలో నోటిఫికేషన్ జారీ కానుంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా ఒక్కో విడత ఎన్నికల నిర్వహణకు 18 రోజుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిం చనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం–2018 లోని నిబంధనలను షెడ్యూల్ జారీలో అనుసరించనుంది.
ఇదీ షెడ్యూల్..
ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 4వ రోజు నుంచి 10వ రోజు వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 10వ రోజు సెలవు రోజైనా నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన మర్నాడు వాటిని పరిశీలించనున్నారు. ఒకవేళ ప్రభుత్వ సెలవు ఉన్నా పరిశీలన జరపనున్నారు.నామినేషన్ల పరిశీలన ముగిసిన మరుసటి రోజు నామినేషన్ల స్వీకరణకు అప్పీళ్లను స్వీకరించి ఆ తర్వాతి రోజు పరిష్కరించనున్నారు.నామినేషన్ల పరిశీలన ముగిసిన నాటి నుంచి మూడో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు. ఉపసంహరణ ముగిసిన వెంటనే బరిలో నిలబడే సర్పంచ్, వార్డు సభ్యుల తుది జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువుకు 5వ రోజు తర్వాత అవసరమైతే పోలింగ్ నిర్వహించనున్నా రు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఉప సర్పంచ్ ఎన్నికకు...
తొలుత వార్డు మెంబర్లు, ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కించి వరుసగా ఫలితాలను ప్రకటిం చనున్నారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికకు రిట ర్నింగ్ అధికారి నోటిఫికేషన్ జారీ చేసి ఎంపికైన వార్డు సభ్యులు, సర్పంచ్‌తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. సర్పంచ్‌తోపాటు ఎన్నికైన సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైతేనే ఉప సర్పం చ్ ఎన్నిక పూర్తి చేయనున్నారు. ఏదైనా కారణంతో ఉప సర్పంచ్ ఎన్నిక అదే రోజు సాధ్యంకాని పక్షంలో మరుసటి రోజు నిర్వహించనున్నారు.
‘పంచాయతీ’కి 18 రోజుల షెడ్యూల్
Published Thu, Dec 27 2018 4:47 AM | Last Updated on Thu, Dec 27 2018 8:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment