
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసు విభాగం ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది. డయల్ 100 ఫోన్‌కాల్స్ విభాగంలో అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించినందుకు ఫిక్కీ ఈ అవార్డు అందజేసింది. దేశంలో స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజల రక్షణ, భద్రతా విషయాల్లో మెరుగైన సేవలు అందించిన వారి కోసం ఈ అవార్డు అందిస్తారు. కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చేతుల మీదుగా న్యూఢిలీలో శుక్రవారం అడిషనల్ డీజీ (టెక్నికల్ సర్వీసెస్) రవి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా డయల్100, టెక్నాలజీ టీమ్స్, పాట్రోల్ కార్స్, బ్లూకోల్ట్స్ అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Sri M. Mahendar Reddy, IPS, DGP, TS congratulated the officers of Dial 100, Tech teams, Patrol cars & Blue colts for delivering effective services in emergencies. For achieving FICCI Special Jury Award 2019. pic.twitter.com/jZTBO7sNsd
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) August 23, 2019
Another feather added to TS police in the name of the FICCI presented Smart policing Awards, in which the TSP has received Special Jury award for ‘Dial-100’.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) August 23, 2019
Category –Emergency Response.
Award received by Sri Ravi Gupta ADGP IT&C
from Sri Jitendra Singh Minister of State in PMO. pic.twitter.com/OfoJdlYjqS