రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే తేలేదు: సీఎం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి రాష్ట్ర ప్రజలందరి కృషి ఎంతగానో ఉందని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో సోమవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడే రాష్ట్రాన్ని తీసుకురాలేదని.. ప్రజలు, నాయకులు, ఉద్యోగులు అందరూ కలిస్తేనే రాష్ట్రం వచ్చిందని అన్నారు. అందుకే ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే...
- తెలంగాణ ప్రజల పక్షాన నేపాల్ ప్రజానీకానికి సానుభూతి ప్రకటిస్తున్నా
- అక్కడ ఏ విధమైన సేవ కావాలన్న చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం
- జలదీక్షలో ఉద్యమం ప్రారంభించినప్పుడు అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగాయి.
- దుర్మార్గపూరిత పాలనకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం మాకు కావాలి, వనరులు దక్కాలి, హక్కులు దక్కాలని పోరాడాం
- పోరాటంలో కొన్ని గొప్ప జయాలు, అపజయాలు.. అన్నింటిమధ్య పోరాటం చేశాం
- అప్పట్లో తెలంగాణ భవన్ కూడా కబ్జా చేస్తామని బెదిరించారు
- రోశయ్య ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడినప్పుడు కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆమరణదీక్షకు దిగాను
- ఆ సమయంలో ఉద్వేగం ఆపుకోలేక కన్నీరు పెట్టాను. ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి లాంటి నేతలు నన్ను
- చావు అంచువరకు వెళ్లి మృత్యువును ముద్దాడే సమయంలో తెలంగాణ ప్రకటన వచ్చింది.
- ప్రకటన రాగానే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంది.. కేసీఆర్ చావలేదు, తెలంగాణ వచ్చిందని సంతసించారు
- అంతలోనే కొన్ని గుంటనక్కలు ఆంధ్రా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తున్నట్లు కల్పిత వాతావరణం సృష్టించి ప్రకటన వెనక్కి తీసుకునేలా చేశారు.
- తర్వాత జరిగిన సకలజనుల సమ్మెలో యావత్ విద్యార్థి సమాజం అంతా కూడా గీతగీసి ఒకవైపు కూర్చున్నారు.
- అలా అంతాకలిసి నిలదీయబట్టే ఇప్పుడు తెలంగాణ కల సాకారమైంది.
- కేసీఆర్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మీరంతా కలవబట్టే రాష్ట్రం వచ్చింది. ఈ క్రెడిట్ అంతా తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తున్నా
- నీళ్లమ్మే కాలం వస్తుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడే రాశాడు.. ఆ కాలం ఇప్పటికే వచ్చింది.
- ఎవరైనా ఎన్నికలకు ముందు చెబుతారు.. కానీ నేను శాసనసభలో చెప్పా. తెలంగాణలో ప్రతి లంబాడీ గూడెంలో, ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతో నల్లాలు పెట్టించి మంచినీళ్లు తెస్తా, వాటితో మీ పాదాలు కడుగుతా.. ఇయ్యకపోతే ఓట్లు అడగనన్నా.
- 29 రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రయినా ఈ మాట చెబుతాడా.. నే చెప్పిన.
- ఆనాడు తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఇప్పుడు నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెబుతున్నా.
- కరెంటు మంత్రి, కరెంటు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి ఎలా కరెంటు ఇస్తున్నరో, మంత్రులు.. అధికారులు అంతా కలిసి మంచినీళ్లు కూడా తెస్తరు.
- మన పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కిరికిరి నాయుడు.. మొత్తం రుణాలు మాఫీ చేస్తానని గబ్బు పెట్టిండు
- రైతుల రుణాల్లో సగం మందివి కూడా మాఫీ చేయలేదు
- 17వేల కోట్లతో 34 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తమని చెప్పినం.. మాట నిలబెట్టుకుంటున్నం
- తల తెగిపడ్డా వెనక్కి పోవద్దు కాబట్టి మాట మీద నిలబడ్డా
- పక్కరాష్ట్రంలో అన్నీ మోసాలు, అబద్ధాలే.. ప్రజాసంక్షేమం చేయరు
- మన మీటింగ్ కాడ బఠాణీలు అమ్ముకున్నంతమంది కూడా బాబు మీటింగుకు రాలేదు
- నాలుగు కుక్కలను పక్కన పెట్టుకున్నడు.. అవి మొరుగుతూనే ఉంటాయి
- రాబోయే 15-20 రోజుల్లో దక్షిణ తెలంగాణలో తిరిగినప్పుడు
- ఇది తెలంగాణ గడ్డ, తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కూర్చుని ప్రాజెక్టు కట్టిస్తానని చెప్పా.
- నల్లగొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నా
- పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఇక్కడకు రావడానికి అరగంట ముందు కూడా సమావేశమయ్యా