Telangana Meeting
-
ఇదీ కేసీఆర్ ‘పంచ్’..
హైదరాబాద్: కిరికిరినాయుడు..పొమ్మన్నా పోతలేడు. పొద్దున లేస్తే ప్రతి పనిలోనూ అడ్డుపుల్ల పెడ్తడు. ఆయనకు రాజ్యం ఉన్నా అక్కడికి పోతలేడు. రైతు రుణాలు మాఫీ చేయకుండా వారిని మోసం జేస్తుండు. ప్రజలెమ్మడి పొయ్యి చావు పో. (చంద్రబాబు నాయుడును ఉద్దేశించి) మహబూబ్‌నగర్‌లో టీడీపీ సభకు వచ్చిన జనం...పరేడ్‌గ్రౌండ్స్‌లో బఠాణీలు అమ్ముకునేందుకు వచ్చిన వారితో సమానం. బాబు 4 పెంపుడు కుక్కలను పెట్టుకొని మొరిగి స్తుండు. గాడిదలుంటెనే గుర్రాల విలువ తెలుస్తది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు తొడగొట్టి...జబ్బజరిచి..బరిగీసి తెలంగాణ ఈడ పెట్టుర్రి అని గర్జించారు. 10తులాల బంగరు పతకం చేసి బంగారు తెలంగాణ అనుడు కాదు...ప్రతి తెలంగాణ పౌరుని ముఖం బంగారు నాణెంలా నిగనిగలాడాలె. తెలంగాణ పల్లెల్లో నీళ్లమ్మేందుకు మిషన్లు మోపయినయ్...బ్రహ్మంగారు చెప్పినట్లు నీళ్లమ్మే రోజులొచ్చినయి. వలస ముష్కరుల పాలనలో మన గుండె లపై పేరుకుపోయిన పూడిక ఇది (చెరువుల పునరుద్ధరణపై మాట్లాడుతూ..). సంక్షేమ కార్యక్రమాల అమలుకు వెచ్చించే మొత్తాన్ని దొంగతనం చేసి తెస్తలేను...ఇక్కడి బడ్జెట్‌నే పథకాల అమలుకు ఖర్చు చేస్తున్నా. -
టీఆర్ఎస్ సభ సైడ్‌లైట్స్
కళాకారులు బతుకమ్మలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, పీర్ల ఊరేగింపుతో ఆటపాటల మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఆకాశంలో మిరుమిట్లు గొలిపేలా కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అమెరికా, లండన్ టీఆర్ఎస్ శాఖల అధ్యక్షులు తెచ్చిన తెల్ల పావురాలను కేసీఆర్ ఎగరేశారు. సభకు ముందు లంబాడీ భాషలో పాడిన పాట లకు లంబాడా మహిళలు నృత్యాలు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కళాకారులతో కలసి ఆడిపాడారు మహిళలు తెచ్చిన బతుకమ్మలను పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ నెత్తిన ఎత్తుకొని సభా ప్రాంగణంలో సందడి చేశారు. ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన గానమా..పోరు తెలంగాణమా’ పాటకు హోంమంత్రి నాయిని వేదికపై స్టెప్పులేశారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు బోనాలు ఎత్తి కళాకారులు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. కళాకారులు ఎల్లమ్మ, మైసమ్మలను స్తుతిస్తూ పాడిన పాటలకు పలువురు మహిళా కార్యకర్తలు శివసత్తుల్లా పూనకం వచ్చి ఊగారు. పముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘అన్నా మా కేసీఆర్.. మనకోసం వచ్చేనన్నా..’ పాటల సీడీని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆవిష్కరించారు. సభకు వచ్చే కార్యకర్తలు అల్వాల్, తార్నాక, చేవెళ్ల మార్గాల్లో చిక్కుకుపోయారని వారిని ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించి సభా ప్రాంగణానికి చేర్చాలంటూ సభ నిర్వాహకులు వేదికపై నుంచి పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఎల్ఈడీ లైట్లు, ఫ్లడ్‌లైట్లు సభా ప్రాంగణాన్ని ధగధగలాడేలా చేశాయి. జై మిషన్ కాకతీయ సీడీని ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు వేదికపై నుంచి ఆవిష్కరించారు. -
టీఆర్ఎస్ సభ సక్సెస్
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ విజయగర్జన సభ విజయవంతం పది జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన జనం హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ర్ట సమితి 14వ ఆవిర్భావ సభ విజయవంతమైంది. అంచనాలకు తగినట్లే జనసమీకరణ జరగడంతో పార్టీ నాయకత్వం ఆనందంలో మునిగిపోయింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికార పార్టీ హోదాలో జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో... టీఆర్ఎస్ నాయకత్వం సభను విజయవంతం చేయడం కోసం అన్ని చర్యలూ చేపట్టింది. ప్రజలకు సుపరిపాలన అందిస్తామన్న భరోసా ఇవ్వడం, విపక్షాల నోళ్లు మూయించడం, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనేలా చేయడం, గడిచిన పది నెలల పాలనపై ప్రజలకు వివరించడం, భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించడం వంటి బహుళ లక్ష్యాలతో టీఆర్ఎస్ ఈ ఆవిర్భావ సభను నిర్వహించింది. మధ్యాహ్నం నుంచే: సభ మధ్యాహ్నం 3 గంటలకే మొదలవుతుందని, 5 గంటలకల్లా కేసీఆర్ ప్రసంగం మొదలవుతుందని పార్టీ నాయకులు ప్రచారం చేయడంతో.. జిల్లాల నుంచి మధ్యాహ్నానికే సభాస్థలికి జనం చేరిక మొదలైంది. హైదరాబాద్‌లోకి చేరుకునే ప్రధాన మార్గాల్లోనే వాహనాలకు పార్కిం గ్ ఇవ్వడంతో వచ్చినవారంతా కిలోమీటర్ల కొద్దీ నడిచి పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి వచ్చింది. ఒకే ఒక్కడు.. ప్లీనరీలో మాట్లాడిన వక్తలే ఈ బహిరంగ సభలోనూ ప్రసంగించారు. ఒకవిధంగా సోమవారం సభలో కే సీఆర్ ఒక్కరే ప్రసంగించారని చెప్పొచ్చు. పార్టీ సీనియర్ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేకే, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొద్ది నిమిషాలసేపు మాట్లాడారు. సభా వేదికపై పార్టీ ముఖ్యులు, మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నా.. ఎవరికీ ప్రసంగించే అవకాశం రాలేదు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని...ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టని పలు హామీలపై సీఎం కేసీఆర్ మరోసారి హామీ ఇచ్చారు. రెండు గదుల ఇళ్లు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగాల భర్తీ, కేజీ టు పీజీ వంటి వాటిపై రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా పథకాలపైనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహజ శైలికి భిన్నంగా సభలో 34 నిమిషాల పాటు మాత్రమే ప్రసంగించారు. అందులోనూ పూర్తిగా ప్రభుత్వ పథకాల గురించి, పది నెలల పాలన విజయాలను వివరించడానికే ప్రాధాన్యమిచ్చారు. గతంలోలా ఆయన ప్రసంగంలో మెరుపులు, విరుపులు కనిపించలేదు. మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన విమర్శలు మినహా.. ఇతర పార్టీలు, వాటి నేతలపై పెద్దగా విమర్శలు చేయలేదు. సాధారణంగానే విద్యుత్ కోతల్లేకుండా చేసినదీ వివరించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, బీడీ కార్మికులకు జీవన భృతి, పెన్షన్లు, రైతు రుణమాఫీ, హాస్టళ్లకు సన్నబియ్యం వంటి అంశాలపై మాట్లాడారు. సాయంత్రం 6.44 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న ఆయన.. దాదాపు 7.10 నిమిషాల సమయంలో ప్రసంగం మొదలుపెట్టి, 7.44 గంటల కల్లా ముగించారు. ఆదిలాబాద్, ఖమ్మం వంటి సుదూర ప్రాంతాల నుంచి సభకు వచ్చినవారికి ఇబ్బంది ఉండొద్దనే ముందుగా సభను ముగించామని పార్టీ నేత ఒకరు చెప్పారు. -
నేటి స్వప్నం బంగారు తెలంగాణ
*అన్ని వర్గాల క ళ్లలో వెలుగులు చూడాలి *టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ *ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలా వెలగాలి *పల్లెపల్లెకూ తాగునీరు.. ఇంటింటికీ నల్లా *వచ్చే ఏడాది నుంచి సాగుకు 9 గంటల కరెంట్ *రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు *కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలో రెగ్యులర్ చేస్తాం *నాది వజ్ర సంకల్పం.. మాట తప్పను *ప్లీనరీ నిర్ణయాలనే హామీలుగా ప్రకటించిన సీఎం సాక్షి, హైదరాబాద్:‘ఇప్పుడు మాటలు కాదు.. చేతలు కావాలె.. బంగారు తెలంగాణ లక్ష్యం కావాలె. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. నేటి స్వప్నం బంగారు తెలంగాణ. రాష్ట్రంలో నూటికి 80 శాతం దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలే ఉన్నారు. వీరిలో చాలా మంది పేదోళ్లే. వారి కళ్లలో వెలుగు నిండిన నాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్లు. ఆ వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే తెలంగాణ బాగుపడ్డట్టు. బంగారు తెలంగాణ అంటే పది తులాల బంగారం తెచ్చి పతకం చేసి చూపించొచ్చు. అది కాదు. తెలంగాణలో ప్రతి బిడ్డ ముఖం బంగారు నాణెంలా వెలగాలి. అదే నా లక్ష్యం.. నా స్వప్నం. నా వెంట ఉన్న టీమ్ లక్ష్యం కూడా అదొక్కటే’ అని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ‘విజయ గర్జన’ వేదికపై కేసీఆర్ మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పార్టీ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రస్థానం సాగుతోందన్నారు. ప్లీనరీలో చేసిన తీర్మానాలనే ఈ బహిరంగ సభలో సీఎం హామీలుగా ప్రకటించారు. భారీ భూకంపంతో అల్లాడుతున్న నేపాల్ ప్రజలకు ఈ సందర్భంగా రాష్ర్టం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచినీళ్లతో పాదాలు కడుగుతా రాష్ట్రంలో పల్లెపల్లెకు మంచినీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని కేసీఆర్ ప్రతినబూనారు. ‘తెలంగాణలో ప్రతి తండా, గూడెం, బస్తీలో ఇంటింటికీ ప్రభుత్వ ఖర్చుతోనే నల్లా పెట్టిస్తా. మంచి నీటితో మీ పాదాలు కడుగుతా. ఆనాడు తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన. ఈరోజు మంచి నీళ్లు తేకపోతే ఓట్లు అడగబోమని చెప్తున్నా.. మొండి పట్టుదలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులందరం కష్టపడుతం. మంచినీళ్లు తెచ్చి ప్రజల పాదాలకు అభిషేకం చేస్తాం’ అన్నారు. పగటిపూట 9 గంటల కరెంట్ వచ్చే మార్చి తర్వాత రాష్ర్టంలో వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల కరెంటునిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘ఇక రైతులు చీకట్ల పొలంకాడికి పోవుడు లేదు. ఆటో స్టార్టర్లు అవసరం లేదు. పాములు, తేళ్లు కరిచి చచ్చిపోవుడ్లేదు. ఆరు నూరైనా సరే. తల తాకట్టు పెట్టైనా సరే. పొద్దుందాకా కరెంటిస్తాం. మార్చి తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా తొమ్మిది గంటల కరెంటు ఏకధాటిగా వస్తది. ఇది కేసీఆర్ మాట’ అని నొక్కి చెప్పారు. మిషన్ కాకతీయ పనులతో తెలంగాణ చెరువుల్లో జలకళ మళ్లీ ఉట్టిపడుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘ 60 ఏళ్ల సమైక్య పాలనలో గుండెల మీద పేరుకుపోయిన పాపాన్ని.. చెరువుల్లో పూడుకున్న మట్టిగా తొలగిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మొదలుపెడతాం ఈ ఏడాది నుంచే పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, అంతులేని అవినీతితో ఇళ్ల నిర్మాణం ఆలస్యమైంది. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తాం. పేదలకు అప్పగిస్తాం’ అని పేర్కొన్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని పునరుద్ఘాటించారు. రెండేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ‘కొద్దిపాటి ఆలస్యానికి తప్పుదోవ పట్టవద్దు. జెన్కోలో 20 వేల నుంచి 25 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. కమలనాథన్ కమిటీ విభజన ఆలస్యమవుతోంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా మా తమ్ముళ్లందరికీ ఉద్యోగావకాశాలు వస్తాయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘నాకున్న పెద్ద కల కేజీ టు పీజీ విద్య. కులం మతం లేకుండా ఒకే యూనిఫాం, ఒకే సిలబస్‌తో పిల్లలు చదువుకోవాలనేది నా కోరిక. దాన్ని వచ్చే ఏడాది ప్రారంభిస్తాం’ అని చెప్పారు. మనదే సంక్షేమ రాష్ట్రం ప్రజా సంక్షేమ రంగంలో దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేస్తోందని, ఈ విషయంలో ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధంగా ఉన్నామని రాజకీయ పక్షాలకు కేసీఆర్ సవాల్ విసిరారు. ‘పింఛన్లు, సన్న బియ్యం, అంగన్వాడీ జీతాలు, పౌష్టికాహారానికి ఏటా రూ.28 వేల కోట్లు ఖర్చు చేసే రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంక్షేమానికి చేస్తున్న ఖర్చు చూసి ఆ డబ్బంతా ఎక్కడిదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదేం దొంగతనం చేయట్లే. గతంలో ఆంధ్రకు పోయింది. ఇప్పుడు మన బడ్జెట్‌ను మనకే ఖర్చు చేస్తున్నాం’ అని అన్నారు. నాది వజ్ర సంకల్పం ‘నాకు గోల్మాల్ చేసుడు రాదు. వజ్ర సంకల్పంతో అడుగేస్తా.. బ్రహ్మాండంగా సాధించి తీరుతా. అదే నా లక్షణం.. నాకున్న వీర గుణం’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పదిహేను ఇరవై రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ‘పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాలమూరు పంట పండాలె.. కల్వకుర్తి కొత్త రిజర్వాయర్ కట్టాలె. ఆంధ్ర పాలనలో దుర్నీతి మోసానికి ఎస్సెల్బీసీ పథకమే సాక్ష్యం. ఆ టన్నెల్ ఎన్నేళ్లకు పూర్తి కావాలి. కృష్ణా నది నుంచి పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల చొప్పున 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పూచి నాది. ఉత్తర తెలంగాణలో కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి, దుబ్బాక, సిద్దిపేట, గ జ్వేల్, నర్సాపూర్, భువనగిరి, ఆలేర్, స్టేషన్ ఘనపూర్ దాకా ఉన్న ప్రాంతాల కరువు తీరాలి. ఎస్సారెస్పీతో నిజామాబాద్, ఆదిలాబాద్ పారాలె.. పెన్‌గంగా పారాలె.. నిజామాబాద్ లెండి కాల్వలు పూర్తి కావాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ చాకులాగా పని చేస్తున్నడు. వీటన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం’ అని సీఎం అన్నారు. డల్లాస్‌లా హైదరాబాద్ రాబోయే మూడేళ్లలో అమెరికాలోని డల్లాస్‌లా, సింగపూర్, జపాన్ను తలదన్నే రీతిలో హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘హైదరాబాద్ నగరాన్ని హైటెక్ చేసినం అని మాట్లాడుతరు. ఇక్కడ ఘోరమైన పరిస్థితులున్నవి. తాగేం దుకు నీళ్లు లేవు. వానపడితే కార్లన్నీ బోట్లు కావాలి. సౌకర్యాలు లేవు. మార్కెట్లు లేవు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నయి. మన నగరం మన గుండె కాయ. ఇది విశ్వ నగరంగా రూపుదాల్చాలి. కేసీఆర్ మాట తప్పడు. మీరు నా వెంట నడవండి. జంట నగరాలను ఏ అంతర్జాతీయ నగరాలకు తీసిపోకుండా తయారు చేసి మీకు బహుమతిగా అందజేస్తా’ అని ఆయన పేర్కొన్నారు. ‘తెలంగాణ సాధించిన స్ఫూర్తి, ఆ గౌరవం నా జీవితానికి చాలు. తెచ్చిన తెలంగాణ గుంట నక్కల పాలు కావద్దు. బంగారు తెలంగాణ కావాలి. బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలి. రైతన్నలు సంతోషంగా ఉండాలి. యువకులకు ఉద్యోగాలు రావాలి. అందరి చిరునవ్వుతో ఉండే తెలంగాణ కావాలి. అప్పటివరకు విశ్రమించను. 24 గంటలు పని చేస్తా. మీ కల సాకారం చేస్తా’ అని కేసీఆర్ ప్రమాణం చేశారు. ఏపీలో అన్నీ మోసాలే.. చంద్రబాబు ఓ కిరికిరినాయుడు: కేసీఆర్ ‘పక్క రాష్ట్రంలో అన్నీ మోసాలే. అబద్ధాలే. మీడియా మేనేజ్మెంట్ తప్ప ప్రజాసంక్షేమం లేదు’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ మండిపడ్డారు. ఘాటుగా తనదైన శైలిలో విమర్శించారు. ‘పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి.. మనకొక కిరికిరినాయుడున్నడు. ఇక్కడ ఛీ పో అన్నా ఇంక పోడట. ఆయనకు రాష్ట్రమున్నది. అక్కడ చాలా సమస్యలున్నయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. పొద్దునలేస్తే లేనిదో పుల్ల పెడుతడిక్కడ. అక్కడ ఆయనకు దిక్కులేదు. చెప్పిన వాగ్దానాలను అమలు చేసే తెలివి లేదుగనీ.. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణాలు మాఫీ చేస్త అన్నడు. సబ్బు పెట్టిండు. అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తమని రైతులకు చెప్పిండు. హేరాఫేరీ గోల్మాల్ చేసి సగం మందికి కూడా మాఫీ చేస్తలేడు. మేం ఒక్కటే మాట చెప్పి.. 34 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్లు మాఫీ చేసినం. కానీ నేనేదో ఉద్ధరిస్తా అని.. ఆయన మహబూబ్‌నగర్‌కు వచ్చి కేసీఆర్ నిన్ను నిద్ర పోనియ్యా అంటున్నడు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజు చేయిస్తా అన్నడట. నీ రాష్ట్రంలో దిక్కులేదుగనీ.. ఈడకొచ్చి నిన్ను నిద్ర పోనియ్యా.. నన్ను నిద్రపోనియ్య.. అంటున్నడు. ఆంధ్రకు పోయి ప్రజలెంటవోయి సావుపో. గీడేమున్నది నీకు.. ఈ మధ్య మహబూబ్‌నగర్‌లో పాములాట దుకాణం పెట్టిండు. మన మీటింగ్ దగ్గర బఠానీలు అమ్ముకునేంత మంది కూడా రాలే అక్కడ. దానికే ఆహా.. ఓహో.. అంటున్నరు. మూడు నాలుగు పెంపుడు కుక్కలు పెట్టుకున్నడు. అవి ఇష్టమొచ్చినట్లు మొరుగుతనే ఉంటై. గాళ్లు మొరుగుతున్నరని నువ్వేం భయపడకు కేసీఆర్... గాడిదలుంటేనే కదా గుర్రాల విలువ తెలుస్తదని మనోళ్లు అంటనే ఉన్నరు’ అని బాబు పేరెత్తకుండానే కేసీఆర్ ఆయన్ని కడిగిపారేశారు. ఈ ఘనత తెలంగాణ ప్రజలదే.. పద్నాలుగేళ్ల పార్టీ ప్రస్థానాన్ని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని కేసీఆర్ నెమరువేసుకున్నారు. సోమవారం నాటి టీఆర్ఎస్ భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ గతాన్ని గుర్తుచేసుకున్నారు. 14 ఏళ్ల కిందట జలదృశ్యంలో పిడికెడు మందితో మొదలై ఎన్నో అవమానాలను అధిగమించి ముందుకు కదిలామని, చివరకు దేశ రాజ్యాంగ వ్యవస్థను ఒప్పించి తెలంగాణను సాధించామని అన్నారు. ఉద్యమ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ.. ‘గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ నినాదం మార్మోగింది. గ్రామగ్రామాన ప్రజలు పులిలా పంజా ఎత్తిండ్రు. విద్యార్థిలోకం బెబ్బులిలా ఉద్యమించింది. ఎక్కడివాళ్లక్కడే కథానాయకులైండ్రు. తెలంగాణ సమాజం బరిగీసి ఒక్కతాటిపై నిలబడింది’ అని అన్నారు. ‘ఉద్యమం వీడితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన.. ఇంటికొక యువకుడిని తోడుగా ఇవ్వండి రాష్ట్రం సాధించి తెస్తానని చెప్పిన. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కష్టాలు, బొంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిలా వలసల తెలంగాణగా జీవితాలు మారి పోయాయి. దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం మాక్కావాలి.. హక్కులు మాకు దక్కాలన్న నినాదంతో ఒక్కడినై నిలదీస్తే మీరంతా ఎల్లవేళలా ఆదుకున్నరు’ అని గుర్తు చేసుకున్నారు. ‘ఎన్నో విపత్కర పరిస్థితులు చూసిన. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ నిరాహార దీక్షకు దిగిన. చివరకు నేను కూడా చావు అంచు వరకు వెళ్లి.. మృత్యువును ముద్దాడే క్షణంలో కేంద్రం దిగివచ్చింది. కేసీఆర్ చావలే.. తెలంగాణ వచ్చింది. కొన్ని గుంటనక్కలు, ఒక వర్గం మీడియా కుట్ర చేసి కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేశాయి. సకల జనుల సమ్మెలో సింగరేణి, ప్రజా సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఒక్కతాటిపై నిలిచాయి’ అని అన్నారు. ఆటా పాటా అదుర్స్.. మధ్యాహ్నం 2 గంటల నుంచే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని ధూం..ధాం కళాకారులు పాటలు పాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ‘అయ్యోనివా..నువ్వు అవ్వోనివా.. తెలంగాణ తోటి పాలోనివా..’, ‘పల్లె మేలుకోవాలి..ప్రతి ఇల్లు మేలుకోవాలి..’ అనే పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్, సన్న బియ్యం, ఆసరా పింఛన్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాకారులు పాటలు పాడారు. బతుకమ్మ, బోనాల పండుగలను గుర్తుచేస్తూ పాడిన ఉయ్యాల పాటలకు మహిళలు, కార్యకర్తల నుంచి మంచి స్పందన కనిపించింది. -
నా జీవితానికి ఈ విజయం చాలు.. ఇంకేమీ అక్కర్లేదు!
తెలంగాణ రాష్ట్రం సాధించానన్న విజయం ఒక్కటీ తన జీవితానికి చాలని, ఇంకేమీ అవసరం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. పక్క రాష్ట్రంలో మీడియా మేనేజ్మెంట్ తప్ప మరేమీ లేదు. నేను మాత్రం ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవరకు విశ్రమించేది లేదు. మీరంతా పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చారు.. అందరికీ ధన్యవాదాలు అందరూ వచ్చినందుకు సంతోషం. టీఆర్ఎస్ అంటే ఏందో, తెలంగాణ ప్రజల ఐక్యత ఏందో నిరూపించారు అందరికీ ఒక్కటే మనవి.. అందరినీ సురక్షితంగా ఇళ్లకు చేర్చాలి. అతివేగంతో పోవద్దు చివరిగా ఒక్కటే మాట.. హైదరాబాద్ నగరాన్ని హైటెక్ చేసినమంటారు ఇక్కడ తాగేందుకు మంచినీళ్లు లేవు, మౌలిక సదుపాయాల్లేవు చిన్న వర్షం పడిందంటే నీళ్లన్నీ రోడ్లమీదే ఉంటాయి... ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు. ఇది విశ్వనగరంగా రూపొందాలి. అమెరికాలోని డల్లస్ను తలదన్నే రీతిలో, సింగపూర్ లాంటి నగరాల్లా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నా జంట నగరాలను రాబోయే మూడు, మూడున్నరేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్ది మీకు బహుమానంగా అందిస్తా. నా జీవితానికి ఇప్పటికి సాధించిన విజయం చాలు.. మరే కొత్త విజయాలూ అవసరం లేదు ఈ తెలంగాణ గుంటనక్కల పాలు కావద్దు.. ఇది బంగారు తెలంగాణ కావాలి అందరూ చిరునవ్వుతో ఉండే తెలంగాణ కావాలి.. నాకు వేరే పనిలేదు 24 గంటలూ ఇదే పని చేసి మీకల సాకారం చేస్తా.. జై తెలంగాణ -
రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక్కడే తేలేదు: సీఎం
తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి రాష్ట్ర ప్రజలందరి కృషి ఎంతగానో ఉందని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ 14వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడే రాష్ట్రాన్ని తీసుకురాలేదని.. ప్రజలు, నాయకులు, ఉద్యోగులు అందరూ కలిస్తేనే రాష్ట్రం వచ్చిందని అన్నారు. అందుకే ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే... తెలంగాణ ప్రజల పక్షాన నేపాల్ ప్రజానీకానికి సానుభూతి ప్రకటిస్తున్నా అక్కడ ఏ విధమైన సేవ కావాలన్న చేయడానికి టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం జలదీక్షలో ఉద్యమం ప్రారంభించినప్పుడు అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. దుర్మార్గపూరిత పాలనకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం మాకు కావాలి, వనరులు దక్కాలి, హక్కులు దక్కాలని పోరాడాం పోరాటంలో కొన్ని గొప్ప జయాలు, అపజయాలు.. అన్నింటిమధ్య పోరాటం చేశాం అప్పట్లో తెలంగాణ భవన్ కూడా కబ్జా చేస్తామని బెదిరించారు రోశయ్య ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడినప్పుడు కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని ఆమరణదీక్షకు దిగాను ఆ సమయంలో ఉద్వేగం ఆపుకోలేక కన్నీరు పెట్టాను. ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి లాంటి నేతలు నన్ను చావు అంచువరకు వెళ్లి మృత్యువును ముద్దాడే సమయంలో తెలంగాణ ప్రకటన వచ్చింది. ప్రకటన రాగానే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంది.. కేసీఆర్ చావలేదు, తెలంగాణ వచ్చిందని సంతసించారు అంతలోనే కొన్ని గుంటనక్కలు ఆంధ్రా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తున్నట్లు కల్పిత వాతావరణం సృష్టించి ప్రకటన వెనక్కి తీసుకునేలా చేశారు. తర్వాత జరిగిన సకలజనుల సమ్మెలో యావత్ విద్యార్థి సమాజం అంతా కూడా గీతగీసి ఒకవైపు కూర్చున్నారు. అలా అంతాకలిసి నిలదీయబట్టే ఇప్పుడు తెలంగాణ కల సాకారమైంది. కేసీఆర్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మీరంతా కలవబట్టే రాష్ట్రం వచ్చింది. ఈ క్రెడిట్ అంతా తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తున్నా నీళ్లమ్మే కాలం వస్తుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడే రాశాడు.. ఆ కాలం ఇప్పటికే వచ్చింది. ఎవరైనా ఎన్నికలకు ముందు చెబుతారు.. కానీ నేను శాసనసభలో చెప్పా. తెలంగాణలో ప్రతి లంబాడీ గూడెంలో, ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతో నల్లాలు పెట్టించి మంచినీళ్లు తెస్తా, వాటితో మీ పాదాలు కడుగుతా.. ఇయ్యకపోతే ఓట్లు అడగనన్నా. 29 రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రయినా ఈ మాట చెబుతాడా.. నే చెప్పిన. ఆనాడు తెలంగాణ తేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఇప్పుడు నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెబుతున్నా. కరెంటు మంత్రి, కరెంటు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి ఎలా కరెంటు ఇస్తున్నరో, మంత్రులు.. అధికారులు అంతా కలిసి మంచినీళ్లు కూడా తెస్తరు. మన పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి కిరికిరి నాయుడు.. మొత్తం రుణాలు మాఫీ చేస్తానని గబ్బు పెట్టిండు రైతుల రుణాల్లో సగం మందివి కూడా మాఫీ చేయలేదు 17వేల కోట్లతో 34 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తమని చెప్పినం.. మాట నిలబెట్టుకుంటున్నం తల తెగిపడ్డా వెనక్కి పోవద్దు కాబట్టి మాట మీద నిలబడ్డా పక్కరాష్ట్రంలో అన్నీ మోసాలు, అబద్ధాలే.. ప్రజాసంక్షేమం చేయరు మన మీటింగ్ కాడ బఠాణీలు అమ్ముకున్నంతమంది కూడా బాబు మీటింగుకు రాలేదు నాలుగు కుక్కలను పక్కన పెట్టుకున్నడు.. అవి మొరుగుతూనే ఉంటాయి రాబోయే 15-20 రోజుల్లో దక్షిణ తెలంగాణలో తిరిగినప్పుడు ఇది తెలంగాణ గడ్డ, తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కూర్చుని ప్రాజెక్టు కట్టిస్తానని చెప్పా. నల్లగొండ జిల్లాలో నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నా పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఇక్కడకు రావడానికి అరగంట ముందు కూడా సమావేశమయ్యా -
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
-
సీమాంధ్రలో జై తెలంగాణ అని అనగలవా?
చంద్రబాబుకు కిరణ్ సూటి ప్రశ్న సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తెలంగాణ సభల్లో జై తెలంగాణ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సీమాంధ్రలో కూడా జై తెలంగాణ అనే దమ్ము, ధైర్యం ఉందా అని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో సమైక్యాంధ్ర గురించి తాను ఐదున్నర గంటలు మాట్లాడితే చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. టీడీపీకి ఓటేస్తే రాష్ట్ర విభజనకు ఓటు వేసినట్లే అన్నారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఎన్నికల సభల్లో మాట్లాడుతూ విభజన కు అనుకూలంగా తొలి లేఖ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబే అన్నారు. ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో కిరణ్‌ను టంగుటూరి ప్రకాశం పంతులు మనుమడు గోపాలకృష్ణ కలిశారు.