టీఆర్‌ఎస్ సభ సైడ్‌లైట్స్ | trs party formation hilights | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ సభ సైడ్‌లైట్స్

Published Tue, Apr 28 2015 1:20 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

టీఆర్‌ఎస్ సభ సైడ్‌లైట్స్ - Sakshi

టీఆర్‌ఎస్ సభ సైడ్‌లైట్స్

  • కళాకారులు బతుకమ్మలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, పీర్ల ఊరేగింపుతో ఆటపాటల మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
  • కేసీఆర్ రాక సందర్భంగా ఆకాశంలో మిరుమిట్లు గొలిపేలా కార్యకర్తలు బాణసంచా పేల్చారు.
  • అమెరికా, లండన్ టీఆర్‌ఎస్ శాఖల అధ్యక్షులు తెచ్చిన తెల్ల పావురాలను కేసీఆర్ ఎగరేశారు.
  • సభకు ముందు లంబాడీ భాషలో పాడిన పాట లకు లంబాడా మహిళలు నృత్యాలు చేశారు.
  • పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కళాకారులతో కలసి ఆడిపాడారు
  • మహిళలు తెచ్చిన బతుకమ్మలను పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ నెత్తిన ఎత్తుకొని సభా ప్రాంగణంలో సందడి చేశారు.
  • ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన గానమా..పోరు తెలంగాణమా’ పాటకు హోంమంత్రి నాయిని వేదికపై స్టెప్పులేశారు.
  • కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు బోనాలు ఎత్తి కళాకారులు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు.
  • కళాకారులు ఎల్లమ్మ, మైసమ్మలను స్తుతిస్తూ పాడిన పాటలకు పలువురు మహిళా కార్యకర్తలు శివసత్తుల్లా పూనకం వచ్చి ఊగారు.
  • పముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘అన్నా మా కేసీఆర్.. మనకోసం వచ్చేనన్నా..’ పాటల సీడీని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆవిష్కరించారు.
  • సభకు వచ్చే కార్యకర్తలు అల్వాల్, తార్నాక, చేవెళ్ల మార్గాల్లో చిక్కుకుపోయారని వారిని ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించి సభా ప్రాంగణానికి చేర్చాలంటూ సభ నిర్వాహకులు వేదికపై నుంచి పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
  • సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్లడ్‌లైట్లు సభా ప్రాంగణాన్ని ధగధగలాడేలా చేశాయి.
  • జై మిషన్ కాకతీయ సీడీని ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు వేదికపై నుంచి ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement