hilights
-
విరాట్ కోహ్లి.. స్టన్నింగ్ క్యాచ్!
తిరువనంతపురం: బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి.. ‘సరిలేరు నీకెవ్వరు’ అని పించుకుంటున్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో అతడు పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా కోహ్లి పట్టిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. జడేజా ఇన్నింగ్స్ 14వ ఓవర్లో హెట్‌మైర్ 2 వరుస సిక్సర్లు బాదేశాడు. మరుసటి బంతికీ భారీ షాట్‌నే బాదాడు. లాంగాన్‌లో ఉన్న కోహ్లి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. లిప్తపాటు కాలంలోనే క్యాచ్‌ను పట్టేయడం... అసాధారణ వేగాన్ని నియంత్రించుకొని... బౌండరీ లైన్‌కు తగిలే సమయంలో చేతిని తాకకుండా చేయడం అన్నీ కళ్లు మూసి తెరిచేలోపే జరిగిపోయాయి. వారెవ్వా క్యాచ్ అంటూ స్టేడియం చప్పట్లతో మోగిపోయింది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. చివరి మ్యాచ్ ఈనెల 11న ముంబైలో జరగనుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. కోహ్లి, రోహిత్‌లు ఉండగా.. మార్టిన్ గప్టిల్(2463, న్యూజిలాండ్), షోయాబ్ మాలిక్(2263; పాకిస్తాన్) తరువాతి స్థానాల్లో ఉన్నారు. Stunner! Only if some of the other fielders get inspired by Virat Kohli. What An Athlete. #INDvsWI #ViratKohli pic.twitter.com/F0GGYyMJS0 — V I P E R™ (@Offl_TheViper) December 8, 2019 -
టీఆర్ఎస్ సభ సైడ్‌లైట్స్
కళాకారులు బతుకమ్మలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, పీర్ల ఊరేగింపుతో ఆటపాటల మధ్య సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఆకాశంలో మిరుమిట్లు గొలిపేలా కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అమెరికా, లండన్ టీఆర్ఎస్ శాఖల అధ్యక్షులు తెచ్చిన తెల్ల పావురాలను కేసీఆర్ ఎగరేశారు. సభకు ముందు లంబాడీ భాషలో పాడిన పాట లకు లంబాడా మహిళలు నృత్యాలు చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కళాకారులతో కలసి ఆడిపాడారు మహిళలు తెచ్చిన బతుకమ్మలను పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ నెత్తిన ఎత్తుకొని సభా ప్రాంగణంలో సందడి చేశారు. ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన గానమా..పోరు తెలంగాణమా’ పాటకు హోంమంత్రి నాయిని వేదికపై స్టెప్పులేశారు. కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు బోనాలు ఎత్తి కళాకారులు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. కళాకారులు ఎల్లమ్మ, మైసమ్మలను స్తుతిస్తూ పాడిన పాటలకు పలువురు మహిళా కార్యకర్తలు శివసత్తుల్లా పూనకం వచ్చి ఊగారు. పముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘అన్నా మా కేసీఆర్.. మనకోసం వచ్చేనన్నా..’ పాటల సీడీని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆవిష్కరించారు. సభకు వచ్చే కార్యకర్తలు అల్వాల్, తార్నాక, చేవెళ్ల మార్గాల్లో చిక్కుకుపోయారని వారిని ట్రాఫిక్ చిక్కుల నుంచి తప్పించి సభా ప్రాంగణానికి చేర్చాలంటూ సభ నిర్వాహకులు వేదికపై నుంచి పలుమార్లు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ఎల్ఈడీ లైట్లు, ఫ్లడ్‌లైట్లు సభా ప్రాంగణాన్ని ధగధగలాడేలా చేశాయి. జై మిషన్ కాకతీయ సీడీని ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు వేదికపై నుంచి ఆవిష్కరించారు.