సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా, భౌగోళిక పరంగా దేశంలో 12వ స్థానంలో ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన ‘తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్-2015’ పుస్తకంలో స్పష్టం చేసింది. పుస్తకాన్ని మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ అర్థగణాంక శాఖ తొలిసారిగా ప్రచురించిన ఈ పుస్తకంలో రాష్ట్రం లోని మొత్తం జనాభా, కుటుంబాలు, అక్షరాస్యత, వ్యవసాయం, దిగుబడులు తదితర అన్ని అంశాలను పొందుపరిచారు.
భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం 14,840 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. రాష్ట్రంలోని పది జిల్లాలలో కలిపి మొత్తం 68 నగరాలు/ పట్టణాలు ఉన్నా యి. ఇందులో 6 కార్పొరేషన్లు, 37 మున్సిపాలిటీలు, 25 నగర పంచాయతీలు ఉన్నాయి. ఇక గ్రామ పంచాయతీలు 8,691 ఉన్నా యి. గ్రామ పంచాయతీల్లో 200 జనాభా ఉన్న పంచాయతీలు 346 ఉంటే.. 500 లోపు జనాభా ఉన్నవి 870. వెయ్యిలోపు జనాభా ఉన్నవి 1,733. రెండువేల లోపు జనాభా ఉన్నవి 3,029. ఐదువేల లోపు జనాభా ఉన్నవి 3,104. పదివేల లోపు జనాభా ఉన్నవి 630. కాగా, పదివేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలు 122 ఉన్నట్లు పుస్తకంలో పేర్కొన్నారు.
అలాగే, రాష్ట్రం మొత్తంలో 83,57,826 కుటుంబాలు ఉన్నాయి. ఇక వ్యవసాయ భూమి విషయానికి వస్తే 34.56 లక్షల హెక్టార్లు ఉంటే, ధాన్యాల ఉత్పత్తి 107 కోట్ల టన్నులుగా ఉంది. ఇందులో వరి ధాన్యం దిగుబడి హెక్టార్‌కు 3,297 కిలోలు, జొన్నలు 1,015 కిలోలు, మొక్కజొన్న 4,685 కిలోలు ఉన్నట్లు అర్థగణాంక శాఖ పుస్తకంలో పేర్కొన్నారు.
తెలంగాణ నంబర్ -12
Published Thu, Jan 1 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:02 PM
Advertisement
Advertisement