ఉక్రెయిన్‌లో నల్లగొండ విద్యార్థి మృతి | Telangana Student died of Pneumonia in Ukraine | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌లో నల్లగొండ విద్యార్థి మృతి

Published Thu, Jul 9 2015 7:42 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

Telangana Student died of Pneumonia in Ukraine

రామన్నపేట (నల్లగొండ) : ఉక్రెయిన్‌లోని జెప్రోసియాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నల్లగొండ జిల్లాకు  చెందిన దేవరపల్లి శ్రీకాంత్‌రెడ్డి (20)  అనే విద్యార్ధి బుధవారం ఉదయం మృతి చెందాడు.  శ్రీకాంత్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

రామన్నపేట మండలం దుబ్బాక పంచాయతీ రొంటకోలు గ్రామానికి చెందిన దేవరపల్లి భిక్షంరెడ్డి-సూర్యకళ దంపతుల కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి. ఉక్రెయిన్‌లో జెప్రోసియాల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే వారం రోజులుగా న్యుమోనియాతో బాధపడుతూ పరిస్థితి విషమించి బుధవారం ఉదయం మృతిచెందినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement