తెలంగాణ విద్యార్థులకు తీపికబురు | telangana students messcharges hiked | Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యార్థులకు తీపికబురు

Published Mon, Mar 27 2017 1:11 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

తెలంగాణ విద్యార్థులకు తీపికబురు - Sakshi

తెలంగాణ విద్యార్థులకు తీపికబురు

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు. వారి మెస్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం చెప్పే క్రమంలో భాగంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మెస్‌ ఛార్జీల పెంపుతో 18లక్షలమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. మూడు నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.950కి, 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.1100కు, ఇంటర్‌ నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు రూ.1400కు మెస్‌ చార్జీలు పెంచుతున్నట్లు కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement