
తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. అత్తాపూర్ క్రిస్టల్ గార్డెన్స్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత వహించారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సమావేశానికి వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా హాజరు అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ పది జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరు అయ్యారు.
సాయంత్రం వరకు జరిగే సమావేశంలో పార్టీని కిందిస్థాయి నుండి బలోపేతం చేయటం, తెలంగాణ ప్రజల సమస్యలపై పోరుబాట వంటి అంశాలపై చర్చించనున్నారు. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, విద్యుత్ సమస్య, పింఛన్ల కోత, ఫీజురీయింబర్స్‌మెంట్, 108, 104 సేవలకు అంతరాయం తదితర అంశాలపై పూర్తి స్థాయి చర్చ నిర్వహించి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. పార్టీని పటిష్టం చేయటం, ప్రజల పక్షాన పోరాడటమే తమ ముందున్న లక్ష్యాలనీ, పార్టీ శ్రేణులకు జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర నేతలు దిశానిర్దేశం చేస్తారు.